Jallikattu: మధురైలో జల్లికట్టు సంబరాలు.. పోటీలో 5వేల ఎడ్లు

Jallikattu: మధురైలో జల్లికట్టు సంబరాలు.. పోటీలో 5వేల ఎడ్లు
Jallikattu: ఎక్కువ సేపు ఎద్దును కట్టడి చేయగలిగినవారినే విన్నర్‌

Jallikattu: తమిళనాడులో పోట్లగిత్తల్ని లొంగదీసుకునేందుకు కుర్రాళ్లు పోటీ పడుతున్నారు. పొంగల్‌ వేడుకల్లో భాగంగా సంప్రదాయంగా వస్తున్న జల్లికట్టు ఆటలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో యువత ముందుకొచ్చారు. మధురైలోని పోటీల్లో 300 మందికే అనుమతి ఇచ్చారు.

ఇక రింగులోకి దించేందుకు, ఇక్కడ జరిగే 3 ఈ వెంట్లలో పాల్గొనేందుకు, 5 వేల ఎడ్లను రిజిస్టర్ చేయించుకున్నారు. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల్ని మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేసినా జనం మాత్రం పోటెత్తారు. మధురైలోని అవనియాపురంలో జల్లికట్టు కోలాహలం ఓ రేంజ్‌లో ఉంది.

ఇక్కడి విజేతలకు ఎమెల్యే ఉదయనిధి స్టాలిన్‌ బహుమతులు అందచేస్తారు. జల్లికట్టులో పాల్గొనేవారందరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పూర్తై ఉండాలనే నిబంధన, అలాగే బరిలోకి వెళ్లే ముందు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ సమర్పించడం లాంటి నిబంధనల్ని తప్పనిసరి చేశారు.

ఈ జల్లికట్టులో ఎద్దుల్ని లొంగదీసుకోవడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. తాడు లాంటివేమీ లేకుండా కేవలం చేతులతో వాటిని నియంత్రించాలి. ఎద్దుల మూపురం పట్టుకుని కట్టడి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అవి కొమ్ములతో కుళ్లబొడిచేసే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

ఐతే.. చాకచక్యంగా వ్యవహరిస్తూ పోట్ల గిత్తల్నిమచ్చిక చేసుకుని, లొంగదీసినవారే విజేతగా నిలుస్తారు. గతంలో ఎద్దుల మెడలో పకలల్ని కట్టేవారు. అవి తీసుకొచ్చినవారు విజేతలయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ఎక్కువ సేపు ఎద్దును కట్టడి చేయగలిగినవారినే విన్నర్‌గా ప్రకటిస్తున్నారు.

2014లోనే జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించినా.. ఈ సంప్రదాయం కొనసాగించాలంటూ అనేక నిరనసలు హోరెత్తాయి. దీంతో కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్‌తో దీనికి అనుమతి లభించింది. ఈ సంప్రదాయ క్రీడలో జంతువుల్ని హింసిస్తారు అనే వాదనను తోసిపుచ్చుతున్న తమిళులు.. ఏటా ఈ జల్లికట్టును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా మధురైలో జరిగే వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story