Karnataka CM: సినిమా చూసి సీఎం కంటతడి..

Karnataka CM: సినిమా చూసి సీఎం కంటతడి..
Karnataka CM: కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై 777 చార్లీ సినిమాని చూసి కంటతడి పెట్టారు.

Karnataka CM: సీఎం బొమ్మై శునక ప్రేమికుడు. గతేడాది తన పెంపుడు శునకం మరణించడంతో కలత చెందారు.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమా చూశాక తన పెంపుడు శునకం గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురయ్యారు.

ముఖ్యమంత్రి ఎమోషన్ అయిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రీసెంట్‌గా ఈ సినిమా చూసి బయటకు వచ్చిన సీఎం సినిమా చూశాక తన పెట్ గుర్తుకొచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పారు.

ఈ చిత్రం శునకం, దాని యజమాని మధ్య ఉన్న సంబంధాన్ని గురించి చూపిస్తుంది. జంతు ప్రేమికులందరికీ అ సినిమా నచ్చుతుంది. సీఎం బొమ్మైకి సినిమా బాగా నచ్చింది. చిత్రం చూసి సీఎం భావోద్వేగానికి గురయ్యారు.

సినిమా చూసిన బొమ్మై మాట్లాడుతూ.. పెట్స్ మీద తీసిన సినిమాలు చూశానని అయితే ఈ సినిమాలో ఎమోషన్స్, జంతువులతో సినర్జీ ఉంటుందని ఆయన అన్నారు.

శునకం తన భావాలను కళ్ల ద్వారా వ్యక్తపరుస్తుందని తెలిపారు. ఈ సినిమా అందరూ చూడాల్సిందే. ప్రేమ అనేది షరతులు లేనిది. స్వచ్ఛమైనది.. రక్షిత్ శెట్టి నటించిన ఈ చిత్రం కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాపై జనాలు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

కె కిరణ్‌రాజ్ దర్శకత్వం వహించిన 777 చార్లీ ఒక అడ్వెంచర్ కామెడీ డ్రామా. ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి, సంగీత శృంగేరి, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషించారు. పరమ్వా స్టూడియోస్‌పై రక్షిత్ శెట్టి, జిఎస్ గుప్తా సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఇది అన్ని జంతువులకు, ముఖ్యంగా శునక ప్రేమికులకు సంబంధించిన చిత్రం. మనిషికి, పెంపుడు శునకానికి మధ్య ఉండే బంధాన్ని ఈ సినిమా చాలా అందంగా చూపించింది.

CM బొమ్మై ఈ చిత్ర నిర్మాతలను ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడవలసిందిగా కోరారు. సీఎం ఇంట్లో మరణించిన పెంపుడు శునకం ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన అప్పుడు ఎంత ఎమోషన్ అయ్యారో ఈ చిత్రం తెలుపుతోంది.




Tags

Read MoreRead Less
Next Story