Maharashtra : శంభాజీనగర్ గా పేరు మార్చినందుకు వాగ్వాదం.. ఆపై అల్లర్లు

Maharashtra : శంభాజీనగర్ గా పేరు మార్చినందుకు వాగ్వాదం.. ఆపై అల్లర్లు
రంజాన్, రామనవమి కారణంగా మతపరమైన అంశం తీవ్రతరం కాకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బుధవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఛత్రపతి శంభాజీ నగర్ గా పేరు మార్చారని ఓ వర్గం యువకులు మరో వర్గం యువకులతో వాగ్వాదానికి దిగారు. ఇదికాస్తా అల్లర్లకు దారితీసింది. కొందరు యువకులు రాళ్లు రువ్వారు, కార్లను ద్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు చేశారు. రంజాన్, రామనవమి కారణంగా మతపరమైన అంశం తీవ్రతరం కాకుండా ఉండేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ దాడిలో దాదాపు 500-600 మంది యువకులు పాల్గొన్నారని, వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రముఖ రామాలయం ఉన్న కిరాద్‌పురాలో ఈ ఘటన జరిగిందని పోలీసు కమిషనర్ నిఖిల్ గుప్తా తెలిపారు. ఔరంగాబాద్‌లో రెండు వర్గాల యువకుల మధ్య జరిగిన వాగ్వాదం ఛత్రపతి శంభాజీ నగర్‌గా పేరు మార్చినందుకు జరిగినట్లు చెప్పారు. యువకులను అదుపులోకి తీసుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు తెలిపారు. దాదాపు ఆరు నుంచి ఏడు వాహనాలు దెబ్బతిన్నాయనికి, వాటిని తొలగించినట్లు చెప్పారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, హింసకు కారకులైన వారిని పట్టుకునేందుకు 10 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

స్థానిక ఎంపీ ఇంతియాజ్ జలీల్, రాష్ట్ర బీజేపీ మంత్రి అతుల్ సేవ్ సోషల్ మీడియాలో వీడియోలను ప్రచారం చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. "కొన్ని ప్రకటనలపై రెండు గ్రూపుల యువకులు ఘర్షణ పడ్డారు. వందలాది మంది ప్రజలు రోడ్లపై గుమిగూడి రాళ్లు రువ్వడం ప్రారంభించారు" అని AIMIM పార్టీకి చెందిన Mr జలీల్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story