మహారాష్ట్రలో రాజకీయ దుమారం..కేంద్ర మంత్రి అరెస్ట్...

మహారాష్ట్రలో రాజకీయ దుమారం..కేంద్ర మంత్రి అరెస్ట్...
Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య కోల్డ్ వార్ హాట్ టాఫిక్ మారింది.

మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య కోల్డ్ వార్ హాట్ టాఫిక్ మారింది. కేంద్రమంత్రి నారాయణ్‌ రాణేను పోలీసుల అరెస్టు చేయటం సర్వత్రా చర్చనీయంగా మారింది. ముఖ్యమంత్రికి చెంప దెబ్బ అని కేంద్రమంత్రి రాణే అన్నట్లు ఆరోపిస్తూ.. పలు పోలీస్టేషన్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫిర్యాదులను రద్దు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మ‌హారాష్ట్ర పోలీసులు కేంద్రమంత్రి రాణేను అరెస్టు చేయటం దేశవ్యాప్తంగా ఉత్కంఠ కల్గిస్తోంది.

కేంద్రమంత్రి నారాయణ్ రాణే జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా....సోమవారం రాయ్‌గఢ్‌లో మాట్లాడారు. సీఎం ఉద్ధవ్ థాకరే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగంలో దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైందనే విషయాన్ని మర్చిపోయారని తెలిపారు. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో తెలియకపోవడం సిగ్గుచేటు అన్నారు కేంద్రమంత్రి. ఆ సమయంలో తాను అక్కడ ఉండి ఉంటే గట్టిగా చెంప దెబ్బ కొట్టి ఉండేవాడినన్నారు. దీంతో శివసేన నేతలు తీవ్రంగా స్పందించి, రాణేపై ఫిర్యాదులు చేశారు. వీథుల్లోకి వచ్చి ధర్నాలు కూడా చేశారు.

మరోవైపు కేంద్రమంత్రి నారాయణ్ రాణేకి బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. తనపై పెట్టిన FIRలను కొట్టివేయాలని అత్యవసర విచారణ చేపట్టాలని అంతకుముందు హైకోర్టును ఆశ్రయించారు కేంద్రమంత్రి రాణే. 20 ఏళ్ల తరువాత మహారాష్ట్ర పోలీసులు కేంద్రమంత్రిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రి నారాయణ్ రాణే అరెస్టుపై మహారాష్ట్ర బీజేపీ స్పందించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు. తాను ఎవరిని బెదిరించడం లేదన్నారు. బీజేపీ కార్యాలయాలపై దాడులను ఖండించిన ఫడ్నవీస్... దాడులు చేసి తమను బెదిరించలేరని, తాము మౌనంగా ఉండబోమని ఆయన స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story