Tamil Nadu: కూతురు కోసం తల్లి .. 30 ఏళ్లుగా పురుషుడి వేషధారణలో..

Tamil Nadu: కూతురు కోసం తల్లి .. 30 ఏళ్లుగా పురుషుడి వేషధారణలో..
Tamil Nadu: ఈ ప్రపంచంలో అమ్మకు మించిన దైవం ఏం ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైన బిడ్డల భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమిస్తుంది..

Tamil Nadu: ఈ ప్రపంచంలో అమ్మకు మించిన దైవం ఏం ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైన బిడ్డల భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమిస్తుంది.. ఒంటరి మహిళగానూ తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంటుంది. భగవంతుడు అన్ని చోట్లా తానుండలేకే అమ్మని సృష్టించాడని అంటారు.. ఆ నానుడిని నిజం చేసింది తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్.

20ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లయింది.. దురదృష్టం ఆమెను వెంబడించింది.. పెళ్లైన 15 రోజులకే భర్త మరణించాడు.. అప్పటికే గర్భం దాల్చడంతో అంత బాధలోనూ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచించింది.. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించింది.. ఈ క్రమంలో చుట్టూ ఉన్న మగవాళ్ల చూపులు ఆమెను ఇబ్బంది పెట్టేవి.. బిడ్డను ప్రసవించాక బిడ్డ బాగోగులు చూసుకోవాలంటే తాను మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉండాలనుకుంది.. ఇందుకోసం ఓ సంచలనం నిర్ణయం తీసుకుంది.

సమాజంలో ఒంటరి మహిళ బతకడం కష్టం అని భావించింది.. పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది. సెలూన్ కి వెళ్లి జుట్టు కత్తిరించుకుని క్రాఫ్ చేయించుకుంది.. షర్ట్, లుంగీ ధరించి పనిలోకి వెళ్లింది.. ఆమెను చూసిన వారెవరైనా పురుషుడిగానే భావించేవారు.. పేదరికం వల్ల పని కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ మగాడిలా తనని తాను పరిచయం చేసుకునేది.

ఈ క్రమంలోనే ఆమెను స్థానికులు అన్నాచ్చి (పెద్దన్న) అని పిలుచుకుంటారు. స్థానిక హోటల్లో పని చేస్తూ ముత్తు మాస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఇలాగే 30 ఏళ్ల పాటు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కూతురిని పెంచి పెద్ద చేసింది. ఆమెకు ఒక జీవితాన్ని కల్పించింది.

పెచ్చియామ్మాల్ కూతురు షణ్ముక సుందరి మాట్లాడుతూ పనికి వెళ్లి వచ్చే క్రమంలో ఎదురైన వేధింపులు తట్టుకోలేక అమ్మ తన వేషధారణ మార్చుకుంది. అమ్మా, నాన్న అన్నీ తానై నన్ను పెంచింది. అమ్మ ఇలా చేసినందుకు గర్వంగా ఉంది. అయితే ధ్రువీకరణ పత్రాల్లో పురుషుడిలా ఉండడం వల్ల అమ్మకు పింఛను అందడం లేదు.. ఈ వయసులో అమ్మకు పింఛను వస్తే కాస్త ఆసరాగా ఉంటుంది అని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story