Mumbai Firm: పండక్కి ఊరెళ్లినా పనిచెప్తున్నారా.. అయితే ఫైన్ గ్యారెంటీ

Mumbai Firm: పండక్కి ఊరెళ్లినా పనిచెప్తున్నారా.. అయితే ఫైన్ గ్యారెంటీ
Mumbai Firm: ఓ నాలుగు రోజులు సెలవు పెట్టి సంక్రాంతి పండుగని సన్నిహితులతో గడుపుదామని బస్సెక్కితే ఎక్కిన దగ్గర నుంచి మొదలు ఏదో ఒక పని మీద ఆఫీస్ నుంచి ఫోన్..

Mumbai Firm: ఓ నాలుగు రోజులు సెలవు పెట్టి సంక్రాంతి పండుగని సన్నిహితులతో గడుపుదామని బస్సెక్కితే ఎక్కిన దగ్గర నుంచి మొదలు ఏదో ఒక పని మీద ఆఫీస్ నుంచి ఫోన్.. చాలా మంది ఉద్యోగులకు సెలవులు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకునే సమయం. ఊళ్లో ఉన్న పాత మిత్రులతో బాతాఖానీ వేస్తుంటే టింగు మని మోగుతుంది జేబులో ఉన్న ఫోన్.. ఏవిటో తాను లేకపోతే ఆఫీసే నడవదన్నట్టు చీటికి మాటికి ఫోన్ చేసి చిరాకు తెప్పిస్తుంటారు.. అయినా ఓపికతో సమాధానం ఇవ్వాలి. లేదంటే ఉద్యోగం ఊష్టింగ్.. కానీ ముంబై డ్రీమ్ 11లో పని చేసే ఉద్యోగులకు ఆ భయం ఏమీ అక్కర్లేదు.


ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌ను నడుపుతున్న డ్రీమ్11.. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు సెలవు పెడితే వాళ్లని డిస్ట్రబ్ చేయకూడదని రూల్ పెట్టింది. ఒకవేళ విసిగిస్తే మాత్రం రూ. 1 లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సహ వ్యవస్థాపకుడు భవిత్ షేత్ తెలిపారు. ఈ సంస్థ 2008లో స్థాపించబడింది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులు ఏటా కనీసం ఒక వారం సెలవు తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది.



"సంవత్సరానికి ఒకసారి, ఒక వారం పాటు, మీరు మీ ఆఫీస్ పనుల నుండి విశ్రాంతి తీసుకోవచ్చు. "మీకు ఆ సమయంలో కాల్స్ కానీ, మెయిల్స్ కానీ రావు. మేము ఎవరిపైన అయినా ఆధారపడుతున్నామో లేదో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది" అని షేత్ తెలిపారు.



ఉద్యోగులు విరామాన్ని ఆస్వాదించేందుకు వీలుగా ఉండాలి. అందుకే జరిమానా కూడా కఠినంగా అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని షేత్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story