WhatsApp: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. త్వరలో అందుబాటులోకి..

WhatsApp: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. త్వరలో అందుబాటులోకి..
WhatsApp: యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు కనిపెట్టడంపై ఫోకస్ పెడుతుంటుంది.

WhatsApp: యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు కనిపెట్టడంపై ఫోకస్ పెడుతుంటుంది. తాజాగా చాట్, గ్రూప్ చాట్ చేసుకునే యూజర్లు మెసేజ్ లు పిన్ చేసుకునే వెసులుబాటు కల్పించిందని వాబేటా ఇన్ఫో నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని తెలిపింది. త్వరలో రానున్న అప్ డేట్ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వివరించింది.

ఇక ఈ ఫీచర్ ఉపయోగం విషయానికి వస్తే.. వాట్సాప్ చాట్, గ్రూప్ చాట్ లలో యూజర్లు చేసుకునే మెసేజ్ లలో కొన్ని ముఖ్యమైనవి వుంటాయి. వాటిని టాప్ లో పిన్ చేసుకునే వెసులు బాటు ఈ ఫీచర్ లో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పాత వెర్షన్ ఉపయోగిస్తుంటే కొత్త వెర్షన్ అప్ డేట్ చేసుకోమని సూచిస్తుంది.

వాట్సాప్ ఇప్పటికే కాలింగ్ షార్ట్ కట్ క్రియేట్ చేసుకునే ఫీచర్ ను తీసుకురావడంపై పనిచేస్తోందని వాబేటా నివేదిక తెలిపింది. ఇలా సరికొత్త ఫీచర్లు వస్తుండడంతో రోజు రోజుకు యూజర్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో 200 కోట్ల మందికి పైగా ఈ యాప్ ను వినియోగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story