Uttar Pradesh: మునిసిపల్ ఎన్నికలు మోసుకొచ్చిన పెళ్లి వార్త.. 45 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు..

Uttar Pradesh: మునిసిపల్ ఎన్నికలు మోసుకొచ్చిన పెళ్లి వార్త.. 45 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు..
Uttar Pradesh: మహిళలకు ఆ సీటు రిజర్వ్ చేయబడింది. దీంతో 45 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు 45 గంటల్లో తన కోసం ఓ వధువును వెతుక్కున్నారు.

Uttar Pradesh: మహిళలకు ఆ సీటు రిజర్వ్ చేయబడింది. దీంతో 45 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు 45 గంటల్లో తన కోసం ఓ వధువును వెతుక్కున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ మునిసిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్, మమున్ షా ఖాన్, ఈ పదవిని మహిళలకు రిజర్వ్ చేసినట్లు గుర్తించిన తర్వాత తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అతను 45 గంటల్లో తన పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాడు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీకి కేవలం రెండు రోజుల ముందు ఆయన వివాహం చేసుకోనున్నారు. రాంపూర్ మున్సిపల్ సీటును మహిళలకు రిజర్వ్ చేయాలనే నిర్ణయం ప్రస్తుత అధ్యక్షుడు మామున్ ఖాన్ వివాహానికి పురిగొల్పింది. పురుషులు తమ భార్యలను ఎన్నికల్లో నిలబెట్టడం ద్వారా అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎలా పెత్తనం సాగిస్తారనేది OTT సిరీస్ పంచాయతీలో హైలైట్ చేయబడింది.

గత మూడు దశాబ్దాలుగా రాంపూర్ నగర్‌లో కాంగ్రెస్ జెండా మోసే వ్యక్తిగా గుర్తించబడిన ఖాన్, తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి కొత్త ప్రణాళికను రచించారు. మునిసిపల్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రకటించిన తర్వాత ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 17, ఖాన్ వివాహం ఏప్రిల్ 15 శనివారంగా నిర్ణయించబడింది. వాస్తవానికి, మమున్ షా ఖాన్ వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ మున్సిపల్ ఎన్నికలు తన ఆలోచనలను మార్చివేశాయి. మమూన్ షా ఖాన్ మునిసిపల్ ఎన్నికలు మరియు తన వివాహం రెండింటికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. మునిసిపల్ ప్రెసిడెంట్ సీటు మహిళలకు కేటాయించడం తప్పనిసరైనందున తాను పెళ్లి చేసుకోవలసి వచ్చిందని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "ప్రజలు నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. అందుకే నేను ఇప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాను.. నా పెళ్లి 15న, ఎన్నికల్లో పోటీకి నా భార్య వస్తుంది అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story