New Variant BF-7: కరోనా వదిలేలా లేదన్నా.. వ్యాధినిరోధకత తక్కువగా ఉన్న వారికి..

New Variant BF-7: కరోనా వదిలేలా లేదన్నా.. వ్యాధినిరోధకత తక్కువగా ఉన్న వారికి..
మాస్కులు రెడీ చేసుకోండి. శానిటైజర్లు దగ్గర పెట్టుకోండి. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించండి. జససమూహాల్లో తిరగకండి.

New Varient BF-7: మాస్కులు రెడీ చేసుకోండి. శానిటైజర్లు దగ్గర పెట్టుకోండి. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించండి. జససమూహాల్లో తిరగకండి.మళ్లీ కరోనా వైరస్ వచ్చేస్తోంది. ఇప్పటి వరకు చూసిన అన్ని వేరియెంట్ల కంటే ఇప్పుడొస్తున్నది సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లాంటింది. బీఎఫ్‌-7 వేరియంట్‌పై శాస్త్రవేత్తలు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.



ఒక వ్యక్తి నుంచి దాదాపు 19 మంది వ్యక్తులకు ఈ కొత్త వైరస్‌ రకం అంటుకుంటుందని తేల్చారు. కరోనా వైరస్‌ చైనా నుంచి ప్రపంచానికి చేరడానికి కొన్ని నెలలు పట్టింది. కాని, ఈ బీఎఫ్‌-7 వేరియంట్‌ మాత్రం వారాల్లోనే విజృంభిస్తుందని, అతి త్వరలోనే ప్రపంచాన్ని చుట్టేస్తుందని చెప్పుకొచ్చారు సైంటిస్టులు.


ఒమిక్రాన్‌ మ్యుటెంట్‌గా పుట్టుకొచ్చిన బీఎఫ్‌-7 వ్యాప్తి ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ. అందుకే, ఈ వైరస్‌ రకంపై అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వయసు పడిన వాళ్లు, పిల్లలు, గర్భిణులు, ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు, తరచుగా జబ్బుపడే లక్షణాలు ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఇక క్యాన్సర్‌, డయాబెటిస్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్లైతే.. ఇంకా ఇంకా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


చైనా నుంచి వచ్చిన నివేదికల ప్రకారం.. BF-7 తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు చూసిన కరోనా వైరస్‌ రకాల కంటే ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అతి తక్కువ ఇంక్యుబేషన్ సమయం ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు కరోనా వైరస్‌ వచ్చిందని తెలియడానికి రెండు మూడు రోజులు పట్టేది. ఇప్పుడు గంటల్లోనే తెలిసిపోతుంది, అంతటి ఇన్‌ఫెక్షన్‌ సామర్థ్యం ఉందని చైనా రిపోర్ట్స్‌ హెచ్చరిస్తున్నాయి. పైగా గతంలో వైరస్ సోకిన వారికి, వ్యాధినిరోధకత తక్కువగా ఉన్న వారికి ఈ బీఎఫ్‌-7 సోకే అవకాశం చాలా ఎక్కువ.


ఈ కొత్త వేరియంట్ లక్షణాలు కూడా కరోనా లక్షణాల లాగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జ్వరం, ముక్కు కారడం, వీపరీతంగా దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు అధికంగా ఉంటాయి. కొంత మందిలో వికినిడి పోవడం, వాసన గుర్తించలేకపోవడం, ఛాతిలో నొప్పి, వణుకు వంటి దుష్పరిణామాలు కలుగుతాయన్నారు. సో, కొత్త మహమ్మారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story