Gita Gopinath: 'ఒమిక్రాన్' కేసులు వచ్చే నెలలో..

Gita Gopinath: ఒమిక్రాన్ కేసులు వచ్చే నెలలో..
Gita Gopinath: అధిక ఆదాయ దేశాలు 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయగా.. అల్పాదాయ దేశాల్లో 4 శాతం మందికి మాత్రమే టీకాలు అందాయి.

Gita Gopinath: నూతన సంవత్సర వేడుకలకు ఒమిక్రాన్ అడ్డంకిగా మారునుందా అంటే అవుననే చెప్పాలి.. ఎందుకంటే కొత్త వేరియంట్ ప్రభావం గురించి అధ్యయనం చేస్తున్న ప్రధాన ఆర్థిక వేత్త గీతా గోపీనాథ్ మీడియాకు వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్ వచ్చే నెలలో ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పారు. డెల్టా కంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. వచ్చే నెలలో పెరిగే అవకాశం ఉందన్నారు.

దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణముందని నివేదికలను బట్టి తెలుస్తోందని పేర్కొన్నారు. దీంతో ప్రయాణాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అందుకే టీకా వేయించుకోవడంపై అశ్రద్ధ తగదని అన్నారు. ప్రపంచం మొత్తం వ్యాక్సినేటెడ్ కావాలని ఆకాంక్షించారు. లేకపోతే ఇలా కొత్త వేరియంట్లతో ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. టీకా తీసుకుంటే ఒమిక్రాన్ నుంచి కూడా రక్షణ పొందే అవకాశం ఉందన్నారు.

అధిక ఆదాయ దేశాలు 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయగా.. అల్పాదాయ దేశాల్లో 4 శాతం మందికి మాత్రమే టీకాలు అందాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. 80 దేశాలు ఆ లక్ష్యాన్ని చేరుకోలేవు. టీకా డోసుల కొరతే అందుకు కారణం అని గీత వ్యాఖ్యానించారు. కొత్త వేరియంట్ల వేళ.. టీకాలు, వైద్య సామాగ్రిపై ఆంక్షలు విధించవద్దని సంపన్న దేశాలకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story