omicron variant : భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్ వైరస్

omicron variant : భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్ వైరస్
భారత్‌లో ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 69కి చేరింది.

భారత్‌లో ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 69కి చేరింది. అంతకంతకు పెరుగుతున్న కొత్త వేరియంట్‌ కేసులు గుబులురేపుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అలర్ట్‌ అయిన కేంద్రం...విదేశీ ప్రయాణికులపై నిఘాపెట్టింది. ఆరు ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చేవారికి RT-PCR టెస్టులను ముమ్మరం చేసింది.

తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన హైదరాబాద్​టోలిచౌకిలో వైద్యఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో క్రిమిసంహారక ద్రావణం పిచికారీ చేయించింది. టోలిచౌకిలోని పారామౌంట్‌ కాలనీ టెస్టులను ముమ్మరం చేశారు. కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. కాలనీలో కరోనా ఆంక్షలు విధిస్తూ 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసారు అధికారులు. మరోవైపు ఇటీవల కెన్యా, సోమాలియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో బాధితులకు చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

అటు తమిళనాడులో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. నైజీరియా నుంచి చెన్నైకు వచ్చిన 47 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. కేరళలో మరో నలుగురికి ఒమిక్రాన్​ నిర్ధరణతో...బాధితుల సంఖ్య 5కు చేరినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇక మహారాష్ట్రలో నమోదవుతున్న అత్యధిక ఒమిక్రాన్ కేసులతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 32కు చేరింది. జనవరిలో మహారాష్ట్రలో కొత్తవేరియంట్ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. మహారాష్ట్ర సర్కార్‌ వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story