Nagpur: మూడేళ్ల బాలుడిపై ఆరు వీధికుక్కలు దాడి..

Nagpur: మూడేళ్ల బాలుడిపై ఆరు వీధికుక్కలు దాడి..
Nagpur: చిన్నారులపై వీధికుక్కల దాడుల ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. మున్సిపాలిటీ అధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రజలకు వీధికుక్కల నుంచి భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Nagpur: చిన్నారులపై వీధికుక్కల దాడుల ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. మున్సిపాలిటీ అధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రజలకు వీధికుక్కల నుంచి భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. నాగ్‌పూర్‌లోని రోడ్డుపై మూడేళ్ల పసిబిడ్డ ఆడుకుంటున్నాడు. ఇంతలో ఆరు వీధికుక్కల గుంపు చిన్నారిపై దాడి చేశాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డవడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం ఉదయం అన్మోల్ నగర్‌లో దుగ్గు దుబే అనే బాలుడు తన ఇంటి సమీపంలోని రోడ్డుపైకి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని వాథోడ్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుహాస్ చౌదరి తెలిపారు. అకస్మాత్తుగా, కుక్కలు చిన్నారిపై అన్ని వైపుల నుండి దాడి చేశాయి. బాలుడు భయంతో కింద పడిపోయాడు. సహాయం కోసం అరుస్తున్నప్పుడు కుక్కలు చిన్నారిని లాగడం, కొరకడం చేశాయి.

దుగ్గు తల్లి కొడుకు అరుపులు విని సహాయం కోసం పరుగెత్తింద. కుక్కలపైకి రాళ్ళు విసిరి తన కొడుకును వాటి బారి నుంచి కాపాడుకుంది. రక్తస్రావం అయిన తన కొడుకును ఎత్తుకుని ఇంటికి పరుగెత్తింది. బాలుడి మెడ, వీపు, చేతులు, కాళ్లపై లోతైన గాట్లు, గాయాలు ఉన్నాయని గురువారం కుటుంబాన్ని పరామర్శించిన చౌదరి తెలిపారు. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ అందించారు. బుధవారం పిల్లవాడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. బాలుడు ఇప్పుడు కోలుకుని, ఆడుకుంటూ, ఉల్లాసంగా ఉన్నాడని పోలీసలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story