Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం..

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం..
Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 బడ్జెట్ ప్రవేశపెడతారు.



బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా ఏప్రిల్‌ ఆరు వరకు కొనసాగుతాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు..రెండో విడతలో మార్చి 6న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ ఆరున ముగుస్తాయి. బడ్జెట్ సమావేశాల మొదటి రోజునే ఆర్థిక సర్వే నివేదికను ఉభయసభల్లో ప్రవేశపెడతారని అధికారులు తెలిపారు.



తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చేసే తీర్మానంపై చర్చించనున్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం బడ్డెట్‌కు ఆమోదం తెలుపుతారు.

Tags

Read MoreRead Less
Next Story