Photo Of Smiling Relatives At Funeral: మనుషులు కాదు మహానుభావులు.. శవం ముందు నవ్వుతూ ఫోటో..

Photo Of Smiling Relatives At Funeral: మనుషులు కాదు మహానుభావులు.. శవం ముందు నవ్వుతూ ఫోటో..
Photo Of Smiling Relatives At Funeral: కేరళలో జరిగిన ఓ అంత్యక్రియలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం.. కుటుంబ సభ్యులు పేటిక చుట్టూ కూర్చుని సంతోషంగా ఫోటోకు పోజులివ్వడం కనిపిస్తుంది.

Photo Of Smiling Relatives At Funeral: కేరళలో జరిగిన ఓ అంత్యక్రియలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం.. కుటుంబ సభ్యులు పేటిక చుట్టూ కూర్చుని సంతోషంగా ఫోటోకు పోజులివ్వడం కనిపిస్తుంది. 95 ఏళ్ల మరియమ్మ ఆగస్టు 17న మరణించింది. మొత్తం 40 మంది కుటుంబ సభ్యులు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది, ఇందులో కేరళ మంత్రి వి సిన్వాన్‌కుట్టి కూడా చేరారు.

అసలు శవాలను ఫోటో తీయడమే బాధాకరమైన విషయం అంటే మరణించిన మనిషి ముందు కూర్చుని నవ్వుతూ ఫోటోకి ఫోజులు ఇచ్చిన వారిని చూసి ఏమనుకోవాలి అని తొందరపడి మాట జారితే తరువాత బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమెకు 95 ఏళ్లు. ఉన్నంతకాలం సంతోషంగా జీవించింది. ఆమె మరణం కుటుంబానికి బాధాకరమే అయినా సంతోషంగా సాగనంపాలనుకున్నారు. అందుకే ఆమె శవపేటిక పక్కనే కూర్చుని ఫోటోలు దిగారు. నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

కేరళకు చెందిన మరియమ్మ వయసు రిత్యా అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి మంచంలో ఉంది. గత కొన్ని వారాల నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. మరియమ్మకు తొమ్మిది మంది సంతానం. 19 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అందరూ మంచి పొజిషన్‌లో ఉన్నారు. తన కొడుకు, కూతుళ్ల అభివృద్ధి చూసి ఆమె ఎంతో సంతోషపడేది. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు అంతా ఒకచోట కలుసుకునేవారు. మరియమ్మ సంతానం అంటే ఊర్లో అందరూ మంచిగా చెప్పుకునేవారు.

అదృష్టం అంటే ఆమెదే అంతా ఒకేతాటిపై నిలుస్తారు. ఆమె మాటకు విలువిస్తారు. సలహాలు, సంప్రదింపులకు ఆమెను ఆశ్రయిస్తారు ఊళ్లోవాళ్లంతా మరియమ్మ గురించి గొప్పగా మాట్లాడుకునేవారు. అందరికీ తలలో నాలుకలా ఉండే మరియమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో మంచం పట్టింది. ఆమె వారసులంతా చివరి క్షణాల్లో ఆమె దగ్గరే గడిపారు. అందరినీ చూసి ఆమె తృప్తిగా తనువు చాలించారు. అంత్యక్రియలకు సంబంధించిన ప్రార్థనలు ముగిసిన తరువాత కుటుంబసభ్యులు అందరూ కలిసి శవపేటిక ముందు కూర్చుని ఫోటో దిగారు. ఆమె జ్ఞాపకాలన్నీ తమతోనే ఉండాలని తలంచారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

శవం ముందు కూర్చుని నవ్వుతూ ఫోటోలకు ఫోజులేంది అని నెటిజన్లు కుటుంబసభ్యులపై విరుచుకుపడుతున్నరు. అదేమైనా సుందర దృశ్యమా.. కొంచెమైనా బాధలేదు, కాస్తైనా బుద్ధి లేదు అని నెటిజన్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరియమ్మ బంధువు బాబు ఉమ్మన్ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై స్సందించారు. కుటుంబం ఆమెతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకునేందుకే ఈ ఫోటో దిగారని చెప్పాడు.

మరణానంతరం కన్నీళ్లు మాత్రమే చూస్తారు. చనిపోయినవారి గురించి విలపించే బదులు సంతోషంగా వీడ్కోలు పలకాలి అని అన్నారు. కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి మరణించిన మరియమ్మ కుటుంబానికి అనుకూలంగా మాట్లాడారు. మరణం బాధాకరం.. కానీ అది కూడా ఒక రకమైన వీడ్కోలు.. ఆనందంగా జీవించిన వారికి చిరునవ్వుతో వీడ్కోలు పలకడం కంటే సంతోషం ఏముంటుంది.. ఈ ఫోటోకు నెగెటివ్ కామెంట్స్ అవసరం లేదు' అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story