PM Kisan Maan Dhan : రైతులకు వృద్ధాప్యంలో భరోసా.. రూ.3,000 పెన్షన్..

PM Kisan Maan Dhan : రైతులకు వృద్ధాప్యంలో భరోసా.. రూ.3,000 పెన్షన్..
PM Kisan Maan Dhan : రైతుల వృద్ధాప్య జీవితాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం పిఎం కిసాన్ మన్‌ధన్ యోజన అనే పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది.

PM Kisan Maan Dhan : ఈ పథకం కింద, 60 సంవత్సరాల వయస్సు తర్వాత రైతులకు పెన్షన్ పొందే సౌకర్యం లభిస్తుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఏ రైతు అయినా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కింద రైతుకు నెలకు రూ.3000 వరకు పింఛను లభిస్తుంది.

రైతుల వృద్ధాప్య జీవితాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం పిఎం కిసాన్ మన్‌ధన్ యోజన అనే పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది.

రైతులకు వృద్ధాప్యంలో భరోసా.. పింఛన్‌

ప్రధానమంత్రి కిసాన్‌ మాన్ ధన్ యోజన కింద రైతులకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్‌ ఇస్తారు. మీరు PM కిసాన్‌ మన్‌ధన్ పథకంలో జాయిన్ అయ్యేందుకు ఖాతాదారు ఎలాంటి పత్రాలు సమర్పించనవసరం లేదు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో ఉన్న అనేక ప్రయోజనాలు..

పీఎం కిసాన్ మన్‌ధన్ స్కీమ్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఏ రైతు అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కింద రైతుకు నెలకు రూ.3000 వరకు పింఛను లభిస్తుంది.

మన్‌ధన్ యోజన కోసం అవసరమైన పత్రాలు

1. ఆధార్ కార్డ్

2. ఐడెంటిటీ కార్డ్

3. వయస్సు ధృవీకరణ పత్రం

4. ఆదాయ ధృవీకరణ పత్రం

5. బ్యాంక్ ఖాతా పాస్‌బుక్

6. మొబైల్ నంబర్

7. పాస్‌పోర్ట్ సైజు ఫోటో

ఇందుకోసం రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ మన్‌ధన్‌లో కుటుంబ పెన్షన్ కూడా ఉంది. ఖాతాదారుడు మరణిస్తే అతని జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ లభిస్తుంది. కుటుంబ పెన్షన్‌లో జీవిత భాగస్వామి మాత్రమే చేర్చబడ్డారు.

PM కిసాన్ లబ్ధిదారుడికి ఎలా ప్రయోజనం చేకూరుతుంది?

పిఎం కిసాన్ పథకం కింద, ప్రభుత్వం అర్హులైన రైతులకు 2000 రూపాయలతో 3 విడతలుగా ప్రతి సంవత్సరం 6000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తారు. దాని ఖాతాదారులు పెన్షన్ పథకం PM కిసాన్ మన్‌ధన్‌లో చేరాలనుకుంటే వారికి రిజిస్ట్రేషన్ సులభంగా చేయబడుతుంది. అలాగే, రైతు ఈ ఎంపికను ఎంచుకుంటే, పెన్షన్ స్కీమ్‌లో ప్రతి నెలా మినహాయించబడిన కంట్రిబ్యూషన్ కూడా ఈ 3 వాయిదాలలో వచ్చిన మొత్తం నుండి తీసివేయబడుతుంది. అంటే, దీని కోసం PM కిసాన్ ఖాతాదారుడు జేబులోంచి డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.

Tags

Read MoreRead Less
Next Story