PM Modi : మోదీ కీలక ప్రకటన.. మూడు సాగు చట్టాలు వెనక్కి..!

PM Modi :  మోదీ కీలక ప్రకటన.. మూడు సాగు చట్టాలు వెనక్కి..!
PM Modi : దేశ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు.. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని అన్నారు.

PM Modi : ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. కొత్తగా తీసుకువచ్చిన మూడు అగ్రిచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు ఇళ్లకు వెళ్లి పోవాలని విజ్ఞప్తి చేశారు. తానూ చేసిందంతా రైతులు, దేశం కోసమేనన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు ప్రధాని మోడీ.

దేశంలో 80 శాతం మంది రైతులు చిన్న సన్నకారు రైతులేనన్నారు ప్రధాని మోడీ. రైతులకు సరైన ధర లభించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. మద్దతు ధర పెంచడంతో పాటు రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించామని గుర్తు చేశారు. చౌకధరకే నాణ్యమైన విత్తనాలతో పాటు మైక్రో ఇరిగేషన్ సదుపాయం కల్పించామన్నారు.

22 కోట్ల మంది రైతులకు భూసార కార్డులు పంపిణీ చేశామన్నారు. దీంతో దిగుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. ఫసల్ బీమా యోజనను బలోపేతం చేశామన్నారు. అనేక మంది రైతులకు ఫసల్ బీమా యోజన సదుపాయం కల్పించామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story