Narendra Modi : ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ దేశాధినేతగా మోదీ..!

Narendra Modi : ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ దేశాధినేతగా మోదీ..!
Narendra Modi : ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు..

Narendra Modi : ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.. ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్‌ కంపెనీ మార్నింగ్‌ కన్సల్ట్‌ వెల్లడించింది.. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది మోదీకి సానుకూలంగా, 29 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు.. దీంతో ప్రధాని మోదీ నెట్‌ అప్రూవల్‌ రేటింగ్‌ 50గా ఉందని మార్నింగ్‌ కన్సల్ట్‌ తెలిపింది.

ప్రపంచ నేతలకు గల ప్రజాదరణను మార్నింగ్‌ కన్సల్ట్‌ పరిశీలిస్తుంది.. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌ వైడ్‌గా 13 దేశాల అధినేతలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది. ఈ సర్వేలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రేడర్‌ 66 శాతంతో రెండో స్థానంలో నిలిచారు.. ఇటలీ అధ్యక్షుడు మారియో డ్రాగీ 60 శాతంతో మూడో ప్లేస్‌లో, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోలకు 43 శాతం ప్రజాదరణ లభించింది.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ-ఇన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్‌లకు నెట్ నెగెటివ్ అప్రూవల్ రేటింగ్స్ వచ్చాయి. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రజాదరణ దారుణంగా తగ్గిపోయింది. 26 శాతం ప్రజామోదంతో చిట్టచివరి స్థానంలో నిలిచారు.. ఆయన అప్రూవల్ రేటింగ్ మైనస్ 43 వద్ద ఉంది. ఆయనను 64 శాతం మంది డిజప్రూవ్ చేశారు.

మార్నింగ్‌ కన్సల్ట్‌ గత సర్వేల్లోనూ ప్రజామోదంలో మోదీ నంబర్‌ వన్‌ స్థానంలోనే వున్నారు.. 2020 మే నెలలో వెల్లడించిన సర్వేలో మోదీకి 84 శాతం ప్రజామోదం లభించింది. ఆ తర్వాత గత ఏడాది మే నెలలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో మాత్రం ఇది 63 శాతానికి పడిపోయింది. తాజా సర్వేలో 71 శాతం మంది మోదీని ఆమోదించారు.. జనవరిలో వారం రోజులపాటు పబ్లిక్‌ మూవింగ్‌ యావరేజ్‌ కౌంట్‌ చేసి రేటింగ్స్‌ ఇచ్చింది.. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి సంఖ్య వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉన్నట్లు తెలిపింది. అమెరికాలో రోజుకు 45వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా, మిగతా దేశాల్లో సగటున 2 నుంచి ఆరు వేల మంది అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించింది.

Tags

Read MoreRead Less
Next Story