Rinku Singh Rahi: యూపీఎస్సీలో 683వ ర్యాంక్ .. అవినీతిని బయటపెట్టినందుకు 7 సార్లు కాల్పులు..

Rinku Singh Rahi: యూపీఎస్సీలో 683వ ర్యాంక్ .. అవినీతిని బయటపెట్టినందుకు 7 సార్లు కాల్పులు..
Rinku Singh Rahi: 2008లో రింకూ సింగ్ రాహి ముజఫర్‌నగర్‌లో సాంఘిక సంక్షేమ అధికారిగా ఉన్నప్పుడు 83 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు,

Rinku Singh Rahi: 83 కోట్ల కుంభకోణానికి తెరలేపినప్పుడు అతడి శరీరంలోకి 7 బుల్లెట్లు దిగాయి...

ముజఫర్‌నగర్‌ హాపూర్‌కు చెందిన సాంఘిక సంక్షేమ అధికారి రింకూ రాహి యూపీఎస్సీ సివిల్ సర్వీస్‌లో ఎంపికయ్యారు. అతనికి 683వ ర్యాంక్ వచ్చింది.

2008లో రింకూ సింగ్ రాహి ముజఫర్‌నగర్‌లో సాంఘిక సంక్షేమ అధికారిగా ఉన్నప్పుడు 83 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు, దాని కారణంగా అతడిపై ప్రత్యర్థులు పగబట్టి మట్టుపెట్టాలని చూశారు.. ఏడుసార్లు అతడిపై కాల్పులు జరిపారు.

అలీఘర్‌లోని డోరీ నగర్‌లో నివాసముంటున్న రింకూ సింగ్ రాహి తండ్రి పిండి మిల్లును నడుపుతున్నాడు. రింకూ తండ్రి శివదాన్ సింగ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. పిల్లలను కాన్వెంట్ స్కూల్స్ లో చదివించే స్థోమత లేదు. ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు.

ఇంటర్ కూడా ప్రభుత్వ కళాశాలలోనే చదువుకున్నారు. మంచి మార్కులు రావడంతో స్కాలర్‌షిప్ వచ్చింది. ఆపై టాటా ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్ చేసి, ఆ తర్వాత 2008లో పీసీఎస్‌లో ఎంపికయ్యాడు.

2008లో రింకూ రాహి పీసీఎస్ అధికారి అయ్యారు. సాంఘిక సంక్షేమ అధికారిగా ముజఫర్‌నగర్‌లో తొలి పోస్టింగ్‌ పొందారు. 2009లో ఆ శాఖలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టారు. రూ.83 కోట్ల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. కుంభకోణం వెలుగులోకి రావడంతో ఆ శాఖకు చెందిన వారే ఆయనకు శత్రువులుగా మారారు.

ఆ కాల్పుల్లో రింకూ రాహి శరీరంలోకి ఏడు బుల్లెట్లు దూసుకుపోయాయి. అదృష్టం కొద్దీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఒక కన్ను పోయింది, ముఖం మొత్తం వికటించింది. దీని తరువాత అతను భదోహి జిల్లా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీలపై వెళ్లారు.

ప్రస్తుతం హాపూర్‌లో సాంఘిక సంక్షేమ అధికారిగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఏఎస్-పీసీఎస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తన విద్యార్థులు తనను ప్రతిరోజూ యూపీఎస్సీ పరీక్షలు రాయమని అడిగేవారని చెప్పారు. విద్యార్థుల స్ఫూర్తితో రింకు రాహి 2021లో యూపీఎస్సీ పరీక్ష రాసి దేశంలోనే 683వ ర్యాంకు సాధించారు. విద్యార్ధులకు స్పూర్తిగా నిలిచారు.

Tags

Read MoreRead Less
Next Story