SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. వాట్సాప్‌లో కొన్ని సేవలు..

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. వాట్సాప్‌లో కొన్ని సేవలు..
SBI: ప్రభుత్వ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది.

SBI: ప్రభుత్వ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఖాతాదారులు ప్రతి చిన్న అవసరానికి బ్యాంకుకు వచ్చే పని లేకుండా కొన్ని సర్వీసుల్ని వాట్సాప్ ద్వారా అందించనుంది. ఇందుకోసం కస్టమర్లు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం కానీ, ఏటీఎం సెంటర్‌కు వెళ్లే అవసరం కానీ లేదని బ్యాంకు పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా అందించారు.

యువర్ బ్యాంక్ ఈజ్ నౌ ఆన్ వాట్సాప్.. బ్యాంక్ బ్యాలెన్స్, మినీస్టే‌ట్‌మెంట్ వాట్సాప్‌లో పొందండి అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. కస్టమర్లు ఈ సేవలు పొందాలనుకుంటే ఇంగ్లీషులో హాయ్ అని టైప్ చేసి 9022690226 నెంబర్‌కు మెసేజ్ చేయాలని తెలిపింది.

వాట్సాప్‌లో ఎస్‌బీఐ సేవలు..

స్టెప్1: ముందుగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి 917208933148కు WAREG అని టైప్ చేసి అకౌంట్ నెంబర్ ఎస్ఎంఎస్ చేయాలి.

స్టెప్2: రిజిస్టర్ చేసుకున్న తరువాత 919022690226 నంబర్‌పై హాయ్ sbi అని టైప్ చేయాలి లేదా బ్యాంకు నుండి వాట్సాప్‌లో మీకు వచ్చిన మెసేజ్‌కు రిప్లై ఇవ్వండి.

స్టెప్3: రిప్లై ఇచ్చిన తరువాత మళ్లీ మీకు మెసేజ్ వస్తుంది. ప్రియమైన వినియోగదారులారా ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం అని..

1. బ్యాంక్ బ్యాలెన్స్

2. మినీ స్టేట్‌మెంట్

3. వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేసుకోండి

స్టెప్4: మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి లేదా మీ చివరి ఐదు ట్రాన్సాక్షన్‌లకు సంబంధించిన స్టేట్‌మెంట్ పొందడానికి 1 లేదా 2 ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేయాలనుకుంటే మీరు 3 ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

స్టెప్5: పైన పేర్కొన్నట్లుగా సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మినీ స్టే్ట్‌మెంట్ పొందొచ్చు. మిగిలిన వివరాలు కావాలనుకుంటే టైప్ చేసి అడగొచ్చు.

ఎస్బీఐ ఈ వాట్సాప్ సేవల్ని క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు కూడా అందిస్తుంది. వీరికి అకౌంట్ డీటెయిల్స్, రివార్డ్ పాయింట్లు, బ్యాలెన్స్, కార్డ్ చెల్లింపులతో పాటు పలు సేవలు అందుబాటులో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story