ప్రతి 100 కరోనా కేసుల్లో ఏడు కేసులు పిల్లలవే

దేశవ్యాప్తంగా చిన్నారుల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రతి 100 కరోనా కేసుల్లో ఏడు కేసులు పిల్లలవే
X

దేశవ్యాప్తంగా చిన్నారుల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. ప్రతి 100 కరోనా కేసుల్లో.. ఏడు కేసులు పిల్లలకే సోకుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పదేళ్లలోపు పిల్లల్లో గత మార్చిలో 2.8 శాతంగా ఉన్న కేసులు.. ఆగస్ట్‌ నాటికి 7.4 శాతానికి పెరిగినట్లు.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

అయితే కేసులు పెరుగుదల చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాని, అందరూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. మరోవైపు పిల్లల్లో కరోనా పాజిటివిటీ రేటు 58 శాతంగా ఉన్నట్లు సీరో నివేదిక చెబుతోంది. దేశంలో చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు. భారత బయోటెక్‌ కోవాగ్జిన్‌, బయోలాజికల్‌ ఈ, సీరమ్‌ ఇనిస్ట్యిటూట్‌ టీకాలు ఇంకా పరీక్షల దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం అత్యవసర పరిస్థితిలో ఉపయోగించేందుకు జైకోవ్‌ డీ వినియోగిస్తున్నారు.

Next Story

RELATED STORIES