Kerala Police: పోలీసుల ఐడియా బాగా పనిచేసింది.. మంకీలు మళ్లీ రాలేదు..

Kerala Police: పోలీసుల ఐడియా బాగా పనిచేసింది.. మంకీలు మళ్లీ రాలేదు..
Kerala Police: పోలీసులంటే దొంగలకు భయం.. కానీ వానరాలకెందుకు.. అందుకే ఏకంగా స్టేషన్‌లోకే వచ్చి కూర్చుంటున్నాయి.. ఒకటి రెండూ కాదు.. ఏకంగా ఓ బెటాలియన్‌లా కేరళ కుంబుమెట్టు పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నాయి.

Kerala Police: పోలీసులంటే దొంగలకు భయం.. కానీ వానరాలకెందుకు.. అందుకే ఏకంగా స్టేషన్‌లోకే వచ్చి కూర్చుంటున్నాయి.. ఒకటి రెండూ కాదు.. ఏకంగా ఓ బెటాలియన్‌లా కేరళ కుంబుమెట్టు పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నాయి.వీటి నుంచి తప్పించుకునే మార్గం లేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతలో అటుగా వచ్చిన రైతుని ఏదైనా ఐడియా ఉంటే చెప్పమని అడిగారు. దాంతో ఓ మాంచి సలహా ఇచ్చాడు.. దాంతో వానరాల బాధ తప్పింది పోలీసులకు.

కేరళ-తమిళనాడు సరిహద్దులో ఉన్న కుంబుమెట్టు పోలీస్ స్టేషన్ చుట్టూ వానరాలను భయపెట్టేందుకు సిబ్బంది రబ్బరు పాములను ఉపయోగిస్తున్నారు. వానరాలకు వాటిని చూస్తే భయం. అందుకే పాములను చూసి పారిపోతున్నాయి.

పోలీసు సిబ్బందిని సాధారణంగా సమాజానికి కాపలాదారులుగా పరిగణిస్తారు. వారిని మాత్రం రబ్బరు పాములు రక్షిస్తున్నాయి. హై-రేంజ్ ఇడుక్కిలోని ఫారెస్ట్-ఫ్రింజ్ పోలీస్ స్టేషన్‌లో, వారు కోతుల బెడద నుండి తమను తాము రక్షించుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఆలోచనను ఆచరణలో పెట్టారు. అది సక్సెస్ అవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

నిజమైన పాములను పోలి ఉండే చైనా మేడ్ పాములు పోలీసు స్టేషన్ భవనంలోని గ్రిల్స్‌పై, సమీపంలోని చెట్ల కొమ్మలతో సహా వివిధ ప్రదేశాలలో ఉంచారు. వానరాలను అరికట్టేందుకు ఓ రైతు సలహా మేరకు పోలీసులు ఈ పని చేశారు.

కుంబుమెట్టు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పీకే లాల్‌భాయ్‌ మాట్లాడుతూ స్టేషన్‌ సమీపంలో రబ్బరు పాములను చూసిన తర్వాత ఏ కోతి కూడా పోలీస్ స్టేషన్‌లోకి అడుగుపెట్టే ధైర్యం చేయలేదన్నారు. ప్రయోగం సక్సెస్ అయినందుకు ఆనందిస్తున్నామన్నారు.

గత కొన్నేళ్లుగా స్టేషన్‌లో వానరాల బెడద అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని మరో పోలీసు సునీష్ తెలిపారు. గుంపులుగా వచ్చే వానరాలు స్టేషన్ ఆవరణలో తిరుగుతూ కాంపౌండ్‌లోని కూరగాయల తోటను నాశనం చేసేవి. రబ్బరు పాములు ఏర్పాటు చేసిన తరువాత వానరాల రాక గణనీయంగా తగ్గిందని చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story