Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో సోనియా.. తల్లికి షూ లేస్‌ కట్టిన రాహుల్..

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో సోనియా.. తల్లికి షూ లేస్‌ కట్టిన రాహుల్..
Bharat Jodo Yatra: ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.

Bharat Jodo Yatra: ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. సోనియా గాంధీ సోమవారం మధ్యాహ్నం చారిత్రక మైసూర్‌కు చేరుకున్నారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు రోజులు విరామం తీసుకున్నారు. యాత్ర తిరిగి ప్రారంభమైనప్పుడు ఆమె ఈ ఉదయం యాత్రలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో 511 కిలోమీటర్ల మేర యాత్ర 21 రోజుల పాటు కర్ణాటక మీదుగా సాగనుంది. ఇది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమై తమిళనాడు, కేరళ మీదుగా శుక్రవారం కర్ణాటకలోకి ప్రవేశించింది. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు ఐదు నెలల ప్రయాణంలో 26వ రోజుకు చేరుకుంది.

కర్ణాటక యాత్రలో పాల్గొన్న వారితో కలిసి సోనియా గాంధీ నడిచారు. యాత్ర ప్రారంభించినప్పుడు వైద్య పరిక్షల నిమిత్తం సోనియా విదేశాల్లో ఉన్నారు. "ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ పాదయాత్రలో చేరడంతో భారత్ జోడో యాత్రకు పెద్ద ఊపు వచ్చింది. మాండ్యలోని పాండవపుర తాలూకా నుండి యాత్ర పునఃప్రారంభించబడుతుంది" అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

సోనియా గాంధీ స్పోర్ట్స్ షూస్‌తో నడుస్తూ కనిపించారు. శశి థరూర్ షేర్ చేసిన ఫోటోలో రాహుల్ గాంధీ మార్చ్ సందర్భంగా తన తల్లి షూ లేస్‌ను కట్టినట్లు చూపించారు. విజయదశమి తర్వాత కర్ణాటకలో విజయోత్సవం జరగనుంది. సోనియా గాంధీ కర్ణాటక వీధుల్లో నడవడానికి వచ్చినందుకు గర్విస్తున్నాం. రాష్ట్రంలో మేం అధికారంలోకి వస్తున్నాం. బీజేపీ దుకాణం త్వరలో మూతపడనుంది అని డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.

విజయదశమి సందర్భంగా బుధవారం సోనియా గాంధీ హెచ్‌డీ కోటే అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఓ ఆలయంలో పూజలు చేశారు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేయలేదు. చాలా కాలం తర్వాత సోనియా గాంధీకి ఇదే తొలి ర్యాలీ.

సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో చేరడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానిస్తూ, "యాత్రలో సోనియా చేరడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు" అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story