Aboli Jarit: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. స్టార్ కావాలనుకుంటోన్న 19 ఏళ్ల అబోలి

Aboli Jarit: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. స్టార్ కావాలనుకుంటోన్న  19 ఏళ్ల అబోలి
Aboli Jarit: ఎత్తు లేకపోతేనేం, ఎదుగుదల ఆగిపోతేనేం.. ఆత్మ విశ్వాసం మెండుగా ఉంది.

Aboli Jarit: అన్నీ ఉన్నా ఏదో లేదని, మరేదో తక్కువైందని ఎప్పుడూ బాధపడుతుండే వారికి ఇలాంటి వారు ప్రేరణ నిలుస్తారు.. కాళ్లు పని చేయవు.. కనీసం నిలబడలేదు.. అమ్మనాన్న అండగా ఉన్నారు. అదే నాకు కొండంత అండ అని సంబరపడుతోంది అబోలి..

నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల అబోలి జరిత్ చిన్న వయస్సులోనే ఎదుగుదల కుంటుపడే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దాంతో ఆమె ఎదుగుదల ఆగిపోయింది. ఇప్పుడు కేవలం 3 అడుగుల 4 అంగుళాల పొడవు మాత్రమే ఉంది. ఎత్తు లేకపోతేనేం, ఎదుగుదల ఆగిపోతేనేం.. ఆత్మ విశ్వాసం మెండుగా ఉంది. ఆమె గురించి తెలియని వారెవరైనా చిన్న పిల్లే అనుకుంటారు. కానీ ఆమె ఆలోచనలు చాలా పెద్దవి. స్టార్ కావాలని కోరుకుంటోంది.

ఆమె ఏ పరిస్థితితో బాధపడుతోంది?

19 ఏళ్ల అబోలికి మూత్రపిండ రికెట్స్ వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇది ఎముకలకు సంబంధించిన వైకల్యం. మూత్రపిండాల వైఫల్యాన్ని ప్రభావితం చేసే అరుదైన పరిస్థితి. ఆమెకు మూత్రాశయం లేకపోవడం వల్ల డైపర్ ధరించవలసి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం లేదని వైద్యులు ఆమెకు చెప్పారు. అందువల్ల, ఆమె నడవడానికి, బయటకు వెళ్లడానికి కూడా సమస్యలను ఎదుర్కొంటుంది.

చిన్నప్పటి నుంచి తన పరిస్థితిని తలచుకుని ఏ రోజూ బాధపడలేదు.. దాన్ని అంగీకరించడం నేర్చుకుంది. అలానే పెంచారు తల్లిదండ్రులు అబోలీని. నా జీవితం ఇలానే గడుస్తుందని, ఇలా జీవించాలని నేర్చుకున్నాను. కాబట్టి నాకు నేనే ప్రేరణ అంటోంది అబోలి జరిత్ మెండైన ఆత్మవిశ్వాసంతో.

ఆమె ఏమి చేయాలని కోరుకుంటుంది?

అబోలి పరిస్థితి చూసి కొంత మంది జాలి పడుతుంటారు.. మరికొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తుంటారు. కానీ అవేవీ తనపై ఎలాంటి ప్రభావం చూపవని అంటోంది. ఎప్పుడూ సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తానని చెబుతోంది. ప్రతికూల వ్యక్తులచే ప్రభావితం కాకుండా ఉండటానికి శిక్షణ పొందింది. ఒక ఇంటర్వ్యూలో, ఆమె జీవితంలో ముందుకు సాగడానికి తన నుండి తానే ప్రేరణ పొందుతానని చెబుతోంది.

"చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు నాకు జరిగిన దాని నుండి నేను జీవితాన్ని గడపడం నేర్చుకున్నాను కాబట్టి నేను నా స్వంత ప్రేరణను పొందుతాను. ప్రపంచం మొత్తం తన గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పింది. అబోలి ప్రొఫెషనల్ యాక్టర్ లేదా సింగర్ అవ్వాలని కోరుకుంటోంది. తనకు తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇతర కుటుంబ సభ్యులు మద్దతుగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేస్తోంది.

బహుముఖ ప్రజ్ఞాశాలి

అబోలికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉంది. ఇందులో తాను దిగిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. తన పేజీకి దాదాపు 6,700 మంది ఫాలోవర్లు ఉన్నారు . "ది వీల్ చైర్ గర్ల్❤️" ఆమె Instagram ఐడీ. .తన ప్రతిభ కారణంగా, మిస్ వీల్‌చైర్ వరల్డ్ టైటిల్‌ను పొందాలనుకుంటోంది.

అబోలికి చిన్నప్పటి నుండి డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం అంటే ఇష్టం. కానీ వయసు పెరిగే కొద్దీ ఆమె ఎముకలు బలహీనంగా మారాయి. దాంతో పడిపోవడం ప్రారంభించింది. నడవడం కానీ నిలబడటం కానీ చేయలేకపోయేది.

కాళ్లు పని చేయని కారణంగా డ్యాన్స్ చేయలేకపోతోంది.. అయితే దేవుడు తనకు మంచి స్వరాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తోంది. డ్యాన్స్ చేయలేకపోతేనేం పాటలు పాడతానని తనకు తానే సర్థి చెప్పుకుంది. అదే స్పూర్తితో ఇండియన్ ఐడల్ వరకు వెళ్లింది. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఆ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను. "బాలీవుడ్, హాలీవుడ్‌లో నేను గాయకురాలిగా, నటిగా మారాలనుకుంటున్నాను అని ఎంతో ఉత్సాహంగా చెబుతోంది అబోలి. నేను త్వరలో దీన్ని చేయగలనని ఆశిస్తున్నాను అంటూ తన లాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story