Kacha Badam Bhuban Badyakar: గల్లీలో పల్లీలు అమ్ముకునే వ్యక్తిని సెలబ్రెటీని చేసిన కచ్చా బాదం ..

Kacha Badam Bhuban Badyakar: గల్లీలో పల్లీలు అమ్ముకునే వ్యక్తిని సెలబ్రెటీని చేసిన కచ్చా బాదం ..
Kacha Badam Bhuban Badyakar: అరటిపళ్లు, ఆకుకూరలు ఏవి అమ్ముతున్నారో అర్థం కాని అరుపులు.. ఎంతో గమ్మత్తుగా ఉంటాయి..

Kacha Badam Bhuban Badyakar: సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని సెలబ్రెటీలు చేస్తుందో అస్సలు ఊహించలేం. గల్లీలో పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయ్యాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది మరి. సిటీలో మాల్స్ వచ్చి వీధిలో వాళ్ల అరుపులు వంట గదిలోకి వినిపించకుండా పోయాయి కానీ పల్లెటూర్లలో ఆ అరుపులు చెవులను తాకుతూనే ఉన్నాయి.. అరటిపళ్లు, ఆకుకూరలు ఏవి అమ్ముతున్నారో అర్థం కాని అరుపులు.. ఎంతో గమ్మత్తుగా ఉంటాయి..

కచ్చా బాదం (పచ్చి పల్లీలు) అమ్ముకుంటున్న భుబన్ బద్యాకర్.. తాను అరుస్తూ అమ్ముతున్న విధానం కొందరికి నచ్చింది. దాంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

ఎవరీ భుబన్ బద్యాకర్ ?

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని లక్ష్మీనారాయణపూర్ పంచాయతీలోని కురల్‌జూరి గ్రామంలో నివసిస్తుంటాడు భుబన్ బద్యాకర్. పచ్చి వేరుశెనగ అమ్మడానికి సైకిల్‌పై వివిధ ప్రాంతాలకు వెళుతుంటాడు. ఆ విధంగా పల్లీలు అమ్ముతూ రోజుకు రూ.250 సంపాదిస్తాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

మీ దగ్గర పాత గాజులు, పాత గొలుసులు ఉంటే, మీరు వాటిని నాకు ఇవ్వవచ్చు, నేను మీకు సమానమైన వేరుశెనగలను ఇస్తాను అని పాట పాడుతూ అమ్ముకునే వాడు. అది కాస్తా వైరల్ అయ్యింది.

కచా బాదం పాట ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వీధిలో వేరుశెనగలను విక్రయించే భుబన్ యొక్క ప్రత్యేకమైన స్టైల్‌నిఎవరో రికార్డ్ చేసి, నవంబర్ 2021లో ఇంటర్నెట్‌లో షేర్ చేయడంతో అది కాస్తా ట్రెండ్ అయ్యింది.

కచా బాదం పాటను 'ఏక్తారా' అనే ఛానెల్ మొదట క్యాప్చర్ చేసి యూట్యూబ్‌లో షేర్ చేసింది. 2 నెలల వ్యవధిలో, 21 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది.

ఇటీవల ఇంటర్నెట్ సంచలనం కిలీ పాల్ కూడా కచ్చా బాదం పాటకు స్టెప్పులు వేశాడు. దక్షిణ కొరియాకు చెందిన తల్లీకూతుళ్లు కూడా ఈ పాటకు ఫిదా అయి కాలు కదిపారు.

భుబన్ గత 10 సంవత్సరాలుగా వేరుశెనగలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను తన 'కచా బాదం' పాట ద్వారా సోషల్ మీడియాలో కొత్తగా వచ్చిన కీర్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ జనాదరణ పొందిన పాటను కంపోజ్ చేయడానికి ప్రేరణ ప్రసిద్ధ బౌల్ జానపద ట్యూన్ నుండి వచ్చింది.

ఇటీవల ఈ ట్రెండీ పాటను ర్యాప్ రూపంలో రీమేక్ చేసారు. ఇది ఇంటర్నెట్ అంతటా అసలు పాట వలె వైరల్ అవుతోంది. భుబాన్ లాంటి వ్యక్తులు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. దానికోసం నిరంతరం కష్టపడుతూ మన ప్రయత్నం మనం చేయాలి అని చెబుతుంటాడు భుబన్.

ఎడిట్ చేయని ఒరిజినల్ కచా బాదం పాటను ఇక్కడ చూడండి:

Tags

Read MoreRead Less
Next Story