చదువంటే ఇష్టంతో.. పడవ నడుపుకుంటూ పాఠశాలకు..

చదువంటే ఇష్టంతో.. పడవ నడుపుకుంటూ పాఠశాలకు..
ఇన్ని రోజుల్నించి ఇంట్లోనే ఉన్నా సార్‌లు చెప్పే పాఠాలు విందామంటే స్మార్ట్‌ ఫోన్ లేదు.. అందుకే ఇప్పడు బడి తెరిచారు

చదువుకోమంటే చాలు అది లేదు ఇది లేదు అంటూ అన్నీ కంప్లైంట్లు ఇస్తుంటారు ఈ రోజుల్లో పిల్లలు. కానీ ఈ అమ్మాయికి ఎలా వెళతావు తల్లీ బడికి.. చదువుకోపోతే మానే అని అమ్మానాన్నా అంటున్నా వినకుండా పడవ నడుపుకుంటూ పాఠశాలకు వెళుతుంది.. చదువంటే అంత ఇష్టం.. ఇన్ని రోజుల్నించి ఇంట్లోనే ఉన్నా సార్‌లు చెప్పే పాఠాలు విందామంటే స్మార్ట్‌ ఫోన్ లేదు.. అందుకే ఇప్పడు బడి తెరిచారు అనగానే ఎక్కడలేని సంతోషం.. పడవ నడిపే వాళ్లు రాకపోతే తానే నడుపుకుంటూ పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది 15 ఏళ్ల యుపి అమ్మాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా మారాయి. తన వద్ద స్మార్ట్‌ఫోన్ లేనందున ఆన్‌లైన్ తరగతులను కోల్పోయిన తరువాత, సంధ్య సహానీ రాష్ట్రంలో వరదల కారణంగా స్కుల్ ఎగ్గొట్టాలని లేదు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బహ్రంపూర్ ప్రాంతం బ్యాంక్ రోడ్‌లోని అయోధ్య దాస్ గర్ల్స్ ఇంటర్ కాలేజీలో సంధ్య 11 వ తరగతి చదువుతోంది. వర్సాలు, వరదలు తన చదువుకు అడ్డు కాదనుకుంది. ఏ విధంగానైనా పాఠశాలకు చేరుకోవాలని నిశ్చయించుకుంది. అందువల్ల ఆమె ఒక పడవను తన రవాణా మార్గంగా ఉపయోగించాలని నిర్ణయించుకుంది.

సంధ్య వడ్రంగి కుమార్తె. ఆమె తన ఇంటి నుండి పాఠశాలకు వెళ్లాలంటే రాప్తీ నదిని దాటాలి. రోజూ 800 మీటర్ల దూరం నదిలో పడవ మీద ప్రయాణం చేసి పాఠశాలకు వెళుతుంటుంది. సంధ్య పాఠశాల యూనిఫాంలో రాప్తి నదిని పడవ నడుపుకుంటూ వెళుతున్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story