West Bengal: సోదరుడితో ప్రేమలో పడిన భార్య.. ఇద్దరికీ వివాహం చేసిన భర్త

West Bengal: సోదరుడితో ప్రేమలో పడిన భార్య.. ఇద్దరికీ వివాహం చేసిన భర్త
West Bengal: ప్రేమకి వయసుతో పనేముంది. ఎప్పుడైనా కలగొచ్చు.

West Bengal: ప్రేమకి వయసుతో పనేముంది. ఎప్పుడైనా కలగొచ్చు. పెళ్లై 24 ఏళ్లయింది. భార్య తన సోదరుడితో ప్రేమలో పడిన విషయాన్ని ప్రత్యక్షంగా చూశాడు భర్త.


ఇరుగు పొరుగుకి చూపించాడు వారి రాచకార్యాలను. ఆవేశానికి పోకుండా ఆలోచించి వారిద్దరికీ పెళ్లి చేశాడు.. భార్యని సోదరుడికి ఇచ్చి కట్టబెట్టాడు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.


అర్ధరాత్రి ఒకే గదిలో భార్య, సోదరుడు ఉండడం చూసి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు భర్త. అకేసియా పంచాయతీ ప్రాంతానికి చెందిన దిపాలి దేబ్‌నాథ్‌కు అమూల్య దేబ్‌నాథ్‌తో 24 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు 19 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఉద్యోగ రీత్యా అతడు విదేశాల్లో ఉంటున్నాడు.


అమూల్యకు తన భార్య తన సోదరుడు కేశవ్‌తో 'సంబంధం' నెరుపుతుందని తెలుసుకున్నాడు. అయితే దాని గురించి పెద్దగా రచ్చ చేయాలనుకోలేదు. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ''జీవితంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని నాకు అర్థమైంది.


వారికి ఒకరంటే ఒకరికి ప్రేమ. అందుకే వాళ్లకు కలిసి జీవించే అవకాశం కల్పించాను. కొన్ని నిర్ణయాలు కఠినంగానే ఉంటాయి. అయినా తప్పదు అని అమూల్య మీడియాకు వివరించారు.

అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అమూల్య దేబ్‌నాథ్ చేసిన పనిని నమ్మలేకపోయారు. విదేశాల్లో ఉన్న కొడుకుకు ఫోన్ చేసి విచారించగా.. ''ఏం చెప్పను, భాష దొరకడం లేదు. నేను సిగ్గుతో తల వంచుకుంటాన్నాను" అని అన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story