Black Fungus: భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. అసలేంటిది

Black Fungus: భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. అసలేంటిది
బాధితుడికి కరోనా కంటే ముందే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివరించారు.

Black Fungus: కరోనాకే కనికరం లేకుండా పోయిందనుకుంటే మరో కొత్త వైరస్ వచ్చి మరింత భయపెడుతోంది. దాని పేరు బ్లాక్ ఫంగస్ లేదా మ్యుకర్ మైకోసిస్ అని కూడా పిలుస్తున్నారు. మొన్నటి వరకు దేశ రాజధానికే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపించడం కలకలం రేపుతోంది.

బాధితుడికి కరోనా కంటే ముందే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివరించారు. మరి ఇంతకీ ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి, దాన్ని ఎలా గుర్తిస్తారు, ఎవరికి సోకుతుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి లాంటి ప్రశ్నలెన్నో మెదడును తొలుస్తుంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

* డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉన్నట్లు అధ్యయన కారులు గుర్తించారు.

* కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, ఇమ్యునిటీ కంట్రోల్ డ్రగ్స్ వాడిన రోగుల్లో బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుంది.

* అనారోగ్య సమస్యలు ఉండి, స్టెరాయిడ్స్ అధికంగా తీసుకున్న వారు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నట్లు ఆరోగ్య వేత్తలు గుర్తించారు.

* సైనసైటిస్ ఉన్నవారు కూడా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు.

* బ్లాక్ ఫంగస్ వస్తే ముక్కు చుట్టూ నొప్పి, కళ్లు ఎర్రబడడం, ముఖం వాపు, తిమ్మిరులు ఏర్పడతాయి.

* తలనొప్పి, జ్వరం, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు కలుగుతాయి. మానసిక ఆందోళనకు గురవుతారు.

* ముక్కులో దురద, కళ్ల కింద కానీ, కళ్ల పైన కానీ ఉబ్బినట్లు కనిపించినా, కంటి చూపు మందగించినా డాక్టర్ ని సంప్రదించాలి. దంతాలు నొప్పిగా ఉన్నా అశ్రద్ద చేయకూడదు.

* రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ ఫంగస్ వస్తుంది.

* కోవిడ్ బాధితులందరూ ఈ ఫంగస్ బారిన పడతారనే ఆందోళన వద్దు.

ఇక ఆక్సిజన్ తయారీకి వాడే నీరు స్టెరైల్ నీటిని మాత్రమే వాడాలి. దానికి బదులు సాధారణ నీటిని వాడితే బ్లాక్ ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉందని అహ్మదాబాద్ కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ తెలిపారు.

సాధారణ నీటిలో ఉండే సూక్ష్మజీవులు శరీరంలోకి చేరడం వల్ల ఫంగస్ ఏర్పడుతుందని వివరించారు. హ్యుమిడిఫయర్ పరికరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, నీటిని మార్చడం ద్వారా సమస్యను అధిక శాతం నివారించవచ్చని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story