White Fungus: బ్లాక్ ఫంగస్ కి తోడు ఫైట్ ఫంగస్.. మరింత డేంజర్

White Fungus: బ్లాక్ ఫంగస్ కి తోడు ఫైట్ ఫంగస్.. మరింత డేంజర్
ఈ దేశానికేమైంది.. బ్లాక్ ఫంగస్ తో పాటు ఫైట్ ఫంగస్ కూడా వచ్చి మనుషుల ప్రాణాలు హరిస్తోంది.

White Fungus: బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు, ఎందుకంటే ఇది ఊపిరితిత్తులను మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలైన గోర్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, ప్రైవేట్ భాగాలు మరియు నోరు భాగాలు ఇన్ఫెక్షన్ కి గురవుతాయి.

బ్లాక్ ఫంగస్ నగరాల్లోని ప్రజల ప్రాణాలను బలిగొంటున్న సమయంలో, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైట్ ఫంగస్ కేసులు గురువారం నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాలలో అనేక వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.

ఇది సరికొత్త అంటువ్యాధి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీహార్లో 4 వైట్ ఫంగస్ కేసులు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఈ వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ కంటే ప్రాణాంతకమని భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో దేశంలో అనేక బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. రాజస్థాన్, తెలంగాణ, గుజరాత్, హర్యానా, అస్సాం వంటి అనేక రాష్ట్రాలు గురువారం బ్లాక్ ఫంగస్‌ కేసులను గుర్తించాయి.

మరి ఈ వైట్ ఫంగస్ లక్షణాలు కరోనావైరస్ సంక్రమణ మాదిరిగానే ఉంటాయి. ఈ ఫంగస్ ఊపిరితిత్తులపై దాడి చేస్తున్నందున, వ్యాధి సోకిన రోగిపై హెచ్‌ఆర్‌సిటి పరీక్ష చేయడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. ఏదేమైనా, ఈ కొత్త సంక్రమణ ప్రజలను మరింత భయపెడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story