Ukraine Russia: రష్యా వర్సెస్ ఉక్రెయిన్‌.. ఈ యుద్ధంలో ఎవరి బలం ఎంత..?

Ukraine Russia: రష్యా వర్సెస్ ఉక్రెయిన్‌.. ఈ యుద్ధంలో ఎవరి బలం ఎంత..?
Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరి స్ట్రెంత్‌ ఎంత.?

Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరి స్ట్రెంత్‌ ఎంత.? ఎవరి బలం, బలగం ఎంత.? అన్నది ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. రష్యన్‌ ఆర్మీ సూపర్‌ పవర్‌ అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌ ఆర్మీ కూడా తీసిపోయేది కాదు. ఆర్మీ ర్యాంకింగ్స్‌లో రష్యా వరల్డ్‌ నెంబర్‌-2గా ఉంటే.. ఉక్రెయిన్‌ 22వ స్థానంలో ఉంది.

రష్యా దగ్గర 8లక్షల 50వేల మంది సైనికులు ఉండగా.. 2లక్షల 50వేల సాయుధ బలగాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ వద్ద 2లక్షల బలగాలు, 50వేల సాయుధ బలగాలు ఉన్నాయి. రష్యా వద్ద 605 యుద్ధనౌకలు ఉండగా.. ఉక్రెయిన్‌ వద్ద 38 యువ్ధనౌకలు ఉన్నాయి. ఎయిర్‌ఫోర్స్‌ విషయంలో రెండు దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రష్యా అమ్ములపొదలో 4,173 ఎయిర్‌క్రాప్ట్స్‌, 772 ఫైటర్‌ జెట్స్‌ ఉన్నాయి.

ఉక్రెయిన్‌ దగ్గర 318 ఎయిర్‌క్రాప్ట్స్‌, 69 ఫైటర్‌ జెట్స్‌ మాత్రమే ఉన్నాయి. రష్యా ఎయిర్‌ఫోర్స్‌లో 1,534 ఆర్మీ హెలికాప్టర్లు ఉండగా.. ఉక్రెయిన్‌ దగ్గర కేవలం 112 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. భూతల శక్తిలోనూ రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చాలా తేడా ఉంది. రష్మా వద్ద 30,122 ఆర్మ్‌డ్‌ వెహికల్స్‌ ఉంటే.. ఉక్రెయిన్‌ దగ్గర 12,303 ఆర్మ్‌డ్‌ వెహికల్స్‌ ఉన్నాయి.

12,420 యుద్ధట్యాంక్‌లు రష్యా దగ్గర ఉండగా.. 2,596 యుద్ధట్యాంక్‌లు మాత్రమే ఉక్రెయిన్‌ వద్ద ఉన్నాయి. మధ్యశ్రేణి యుద్ధంగా కీలక పాత్ర పోషించే ఎటాక్‌ హెలికాప్టర్ల విషయంలో రెండు దేశాల మధ్య అసలు పొంతనే ఉండదు. రష్యా 544 ఎటాక్‌ హెలికాప్టర్లతో సూపర్‌ పవర్‌గా ఉంటే.. ఉక్రెయిన్‌ దగ్గర కేవలం 34 మాత్రమే ఎటాక్‌ హెలికాప్టర్స్‌ ఉన్నాయి. ఇక రష్యా సైనిక సంపత్తిలో 14,000 శత్రఘ్నులు ఉంటే.. ఉక్రెయిన్‌ వద్ద 3,000 శత్రఘ్నులు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story