Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 37 మంది మృతి..
Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఝల్‌కోటి ప్రాంతం దగ్గర్లో ఉన్న నది సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 310 మంది కెపాసిటీ ఉండే ఓ నౌక 500 మందితో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దాదాపు 37 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచినట్టు సమాచారం.
తెల్లవారుజామున 3 గంటలకు ఝల్‌కోటి ప్రాంతం సమీపంలో నౌకలో మంటలు చెలరేగాయి. దాదాపు 100 మంది కాలిన గాయాలతో ఉండగా.. వారిని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కానీ కొంతమంది మాత్రం మంటలను గమనించి సముద్రంలోకి దూకేశారు. అలా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఢాకా సమీపంలో నౌక ప్రమాదాలు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఆగస్టులో జరిగిన ప్రమాదంలో 21 మంది ఓ ప్రమాదంలో మరణించారు. ఏప్రిల్, మే మధ్యలో రెండు వేర్వేరు ప్రమాదాల కారణంగా 54 మంది మృత్యువాత పడ్డారు. 2021లోనే కాదు అంతకు ముందు కూడా ఢాకాలోని ఆ ప్రాంతంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌కు రాజధాని అయినా కూడా ఢాకాలోనే ఎక్కువగా నౌక ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం.
RELATED STORIES
KCR: ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. అకస్మాత్తుగా తిరుగు ప్రయాణం..
24 May 2022 11:30 AM GMTKTR: సోదరుడు జగన్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది: కేటీఆర్
24 May 2022 10:05 AM GMTNizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTKTR: దావోస్‌లో కొనసాగుతున్న కేటీఆర్ టూర్.. లైఫ్ సైన్సెస్...
23 May 2022 2:00 PM GMTNarendra Modi: మే 26న హైదరాబాద్‌కు మోదీ.. ఆ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా..
23 May 2022 1:00 PM GMTHarish Rao: కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో హరీష్‌రావు ఆకస్మిక తనిఖీ.....
23 May 2022 12:30 PM GMT