Miss Universe: మిస్ యూనివర్స్‌కి భారీ ప్రైజ్ మనీతో పాటు మరిన్ని సౌకర్యాలు..

Miss Universe: మిస్ యూనివర్స్‌కి భారీ ప్రైజ్ మనీతో పాటు మరిన్ని సౌకర్యాలు..
Miss Universe: మిస్ యూనివర్స్ కోసం స్పెషల్‌గా ఒక మేకప్ ఆర్టిస్టుల బృందం ఉంటుంది.

Miss Universe: చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. డిసెంబర్ 12, 2021న, 21 సంవత్సరాల తర్వాత, 21 ఏళ్ల వయసులో, ఇజ్రాయెల్‌లోని ఎలియట్‌లో జరిగిన పోటీలో మిస్ యూనివర్స్‌గా కిరీటాన్ని భారతదేశానికి తీసుకువచ్చింది. ఆమె కంటే ముందు ఇద్దరు భారతీయులు మాత్రమే ఇప్పటి వరకు పోటీని గెలుచుకున్నారు -- 1994లో సుస్మితా సేన్ మరియు 2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు.

ఇప్పుడు హర్నాజ్ కిరీటాన్ని చూసిన తర్వాత, టైటిల్ గెలిచిన తర్వాత మిస్ యూనివర్స్‌కి బహుమతిగా ఏమి లభిస్తుందనే చర్చ నెటిజన్లలో జోరందుకుంది.

21 ఏళ్ల హర్నాజ్ సంధు చండీగఢ్‌కు చెందిన మోడల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తోంది. 2017లో, ఆమె 'టైమ్స్ ఫ్రెష్ ఫేస్' టైటిల్‌ను గెలుచుకుని అందాల పోటీలకు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019, LIVA మిస్ దివా యూనివర్స్ 2021 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

హర్నాజ్ ప్రస్తుతం 'బ్రెయిన్ విత్ బ్యూటీ' పేరుతో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

మిస్ యూనివర్స్ కిరీటం రూపకర్త

మిస్ యూనివర్స్ కిరీటం ప్రతిసారీ మారుతుంది. మౌవాద్ పవర్ ఆఫ్ యూనిటీ క్రౌన్‌ను మిస్ యూనివర్స్ సంస్థ కోసం 2019లో మౌవాద్ జ్యువెలరీ రూపొందించింది. మిస్ యూనివర్స్ హర్నాజ్ ధరించిన కిరీటం విలువ దాదాపు $5 మిలియన్లు. అంటే భారత కరెన్సీలో దీని విలువ రూ.37 కోట్లకు పైమాటే.

మిస్ యూనివర్స్ కిరీటం లక్షణాలు

హర్నాజ్‌కు ఇచ్చిన కిరీటం స్వభావం, అందం, స్త్రీత్వం, ఐక్యత మరియు బలం మీద ఆధారపడి ఉంటుంది. కిరీటంలో 18-క్యారెట్ బంగారం, 1770 వజ్రాలు మరియు మధ్యభాగంలో షీల్డ్-కట్ గోల్డెన్ కానరీ డైమండ్ ఉన్నాయి. ఈ వజ్రం బరువు 62.83 క్యారెట్లు. కిరీటం ఆకులు, రేకులు మరియు తీగలతో అలంకరించబడుతుంది.

మిస్ యూనివర్స్ 2021 టైటిల్ గెలుచుకున్న ఆమెకు న్యూయార్క్‌లోని మిస్ యూనివర్స్ అపార్ట్‌మెంట్‌లో ఒక సంవత్సరం పాటు ఉండేందుకు కూడా అనుమతి ఉంది. దానిని ఆమె మిస్ USAతో పంచుకోవాలి. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఆమెకు ప్రొవిజన్స్, డ్రెస్‌లు ఇలాఅన్ని సౌకర్యాలు ఉచితంగా అందుతాయి.

విలాసవంతమైన జీవితం

మిస్ యూనివర్స్ కోసం స్పెషల్‌గా ఒక మేకప్ ఆర్టిస్టుల బృందం ఉంటుంది. ఈ బృందం మిస్ యూనివర్స్ మేకప్, హెయిర్ ప్రొడక్ట్స్, షూస్, బట్టల, జ్యువెలరీ, స్కిన్ కేర్ దాదాపు ఒక సంవత్సరం పాటు చూసుకుంటుంది. మోడలింగ్ కోసం పోర్ట్‌ఫోలియోను రూపొందించడంలో ఆమెకు సహాయపడటానికి సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ ఫోటోగ్రాఫర్‌లను కూడా అందిస్తుంది. ఇతర విలాసవంతమైన సేవలలో ఫ్యాషన్ స్టైలిస్ట్, న్యూట్రీషియన్, డెర్మటాలజీ మరియు డెంటల్ సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి.

అదే సమయంలో, ప్రత్యేకమైన ఈవెంట్‌లు, పార్టీలు, ప్రీమియర్‌లు, స్క్రీనింగ్‌లు, కాస్టింగ్‌లు, ప్రయాణ ఖర్చులు, హోటల్ ఖర్చులకు అన్నింటిలో ఉచిత ప్రవేశం. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఏడాది పొడవునా ప్రపంచాన్ని పర్యటించడానికి అవకాశం కల్పించబడింది.

విలాసవంతమైన జీవితమే కాదు, మిస్ యూనివర్స్‌కు మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ చీఫ్ అంబాసిడర్‌గా, ఈవెంట్‌లు, పార్టీలు, ఛారిటీ, ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు హాజరవ్వడం వంటి గొప్ప బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆమె చేసే ప్రతి పనిని ఆర్గనైజేషన్ చూసుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story