ఫోన్‌పేలో ఉద్యోగాలు.. ప్రాంతాల వారీగా ఖాళీలు

ఫోన్‌పేలో ఉద్యోగాలు.. ప్రాంతాల వారీగా ఖాళీలు
నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్..

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది ఏపీ ప్రభుత్వం. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ మొబైల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే (Phone Pe)లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టినట్లు ప్రకటించింది.

75 పోస్టుల భర్తీకి గాను ప్రకటన వెలువడింది. అయితే ఈ పోస్టులకు పురుష అభ్యర్ధులను మాత్రమే ఎంపిక చేయనుంది. అభ్యర్ధులు కచ్చితంగా ద్విచక్రవాహనాన్ని, ఆండ్రాయిడ్ ఫోన్‌ను కలిగి ఉండాలనే నిబంధన పెట్టింది. ఆసక్తి గల అభ్యర్ధులు నవంబర్ 25 లోగా రిజిస్టర్ చేసుకోవాలి.

ముఖ్య సమాచారం..

సంస్థ పేరు : ఫోన్ పే

పోస్ట్ పేరు : మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్

ఖాళీలు: 75

విద్యార్హత: ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: 11,500+PF+ఇన్సూరెన్+ఇన్సెంటివ్స్ (రూ.3000-రూ.5000)

అనుభవం: సేల్స్ విభాగంలో కనీసం ఆరు నెలలు పని చేసిన అనుభవం ఉండాలి.

ప్రాంతాల వారీగా ఖాళీలు..

చిత్తూరు, తిరుపతి: 2

గుంటూరు అర్బన్: 2

అనంతపూర్: 5

కాకినాడ: 7

కర్నూల్ : 2

ప్రకాశం : 4

రాజమండ్రి: 2

విజయనగరం, శ్రీకాకుళం: 8

వెస్ట్ గోదావరి: 6

వైఎస్సార్ కడప: 2

విజయవాడ సెంట్రల్ & ఈస్ట్ : 7

విజయవాడ వెస్ట్: 4

వైజాగ్: 24

Tags

Read MoreRead Less
Next Story