పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో BPNLలో పోస్టులు..

పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో BPNLలో పోస్టులు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

bharatiyapashupalan.com: భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) దేశవ్యాప్తంగా భారీ నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో 3216 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://www.bharatiyapashupalan.com వెబ్‌సైట్ చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 3216

సేల్స్ మేనేజర్: 64

సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 485

సేల్స్ హెల్పర్: 2667

ముఖ్య సమాచారం:

అర్హత: సేల్స్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సేల్స్ డెవలప్‌మెంట్ పోస్టులకు ఇంటర, సేల్స్ హెల్పర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

వయసు: సేల్స్ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్లలోపు.. మిగిలిన పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఎఫిసియెన్సీ టెస్ట్. ఇందులో అర్హత సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 15, 2021.

Tags

Read MoreRead Less
Next Story