పదవతరగతి అర్హతతో BROలో ఉద్యోగాలు.. జీతం రూ.20,200

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న 337 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీలు: 337… విభాగాల వారీగా .. డ్రాప్ట్స్‌మెన్-40, హిందీ టైపిస్టు-22, సూపర్ వైజర్ స్టోర్స్-37, రేడియో మెకానిక్-02, లేబొరేటరీ అసిస్టెంట్-01, వెల్డర్-15, మల్టీ స్కిల్ వర్కర్ (మెసన్)-215, మల్టీ స్కిల్ వర్కర్ (మెస్ వెయిటర్)-05.  విద్యార్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికెట్, అనుభవం, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. వయసు: కుక్ పోస్టుకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య, మిగిలిన వాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: జనరల్ OBC అభ్యర్ధులకు రూ.50, SC,ST అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు చివరి తేదీ: 02.09.2019.. ఇతర వివరాలకు వెబ్‌సైట్: http://www.bro.gov.in

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *