UPSC CDS Exam: డిగ్రీ, ఇంజనీరింగ్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.56,100

UPSC CDS Exam: డిగ్రీ, ఇంజనీరింగ్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.56,100
UPSC CDS Exam: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైండ్ డిఫెన్స్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

UPSC CDS Exam: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైండ్ డిఫెన్స్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 341 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ద్వారా ఈ ఎంపిక జరుగుతుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ జనవరి 11, 2022. అభ్యర్ధులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు.. 341,

ఇండియన్ మిలిటరీ అకాడెమీ, డెహ్రాడూన్: 100

ఇండియన్ నావల్ అకాడెమీ, ఎజిమళ: 22

ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ, హైదరాబాద్: 32

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ, చెన్నై: 170

ఎస్‌ఎస్‌సీ విమెన్ (నాన్ టెక్నికల్) : 17

ముఖ్య సమాచారం..

అర్హత: సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు రూ.200 (మహిళా అభ్యర్ధులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఉచితం)

దరఖాస్తు చివరి తేదీ: జనవరి 11, 2022

వెబ్‌సైట్: https://upsconline.nic.in/

ఇతర సమాచారం:

దరకాస్తు వెనక్కి తీసుకోవడానికి జనవరి 18 నుంచి జనవరి 24 వరకు గడువు

అడ్మిషన్లకు ఏప్రిల్ 10న పరీక్ష

మిలిటరీ, నేవీ,ఎయిర్ ఫోర్స్ అకాడమీలోకి ప్రవేశం

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.

సర్వీసెస్ సెలక్షన్ బోర్డు రికమెండ్ చేసిన అభ్యర్ధులకు మెడికల్ ఎగ్జామినేషన్

మెడికల్ బోర్డు నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అందుకున్న వాళ్లకు మాత్రమే అకాడెమీలో ప్రవేశం

ఎయిర్ ఫోర్స్ పోస్టులకు వయసు 20-24 ఏళ్లు ఉండాలి.

ఆర్మీ పోస్టులకు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత

నేవీ పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత

ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఫిజిక్స్, మ్యాథ్స్‌లో డిగ్రీ ఉండాలి.

జీతం: రూ.56,100 - రూ.1.77,500

ట్రైనింగ్‌లో స్టైఫండ్: రూ.56,100

Tags

Read MoreRead Less
Next Story