Education: ఉన్నత విద్యకు కేరాఫ్‌గా మారుతున్న న్యూజిలాండ్

Education: ఉన్నత విద్యకు కేరాఫ్‌గా మారుతున్న న్యూజిలాండ్

ఉన్నత చదువులు అభ్యసించడానికి ప్రతీ ఏటా మన దేశం నుంచి లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ విద్యా విధానం, క్వాలిటీ, పరిశ్రమలతో అనుసంధానం, ఉపాధి, జీవన శైలి వారిని అటువైపు ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ అమెరికానే మన విద్యార్థుల ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటూ వస్తోంది. న్యూజిలాండ్ భద్రత పరంగా ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల్లో ఒకటి. గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో 2వ స్థానంలో నిలుస్తుండటంతో ఇప్పుడు ఆ దేశంపై మనోళ్లు కూడా దృష్టి సారిస్తున్నారు.

మన విద్యార్థులు న్యూజిలాండ్‌ దేశం వైపు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలు కూడా వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత సంవత్సరం మన దేశం నుంచి 1600 మంది విద్యార్థులు ఆ దేశంలో చదువడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్ నెల నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు 1677 మందికి స్టూడెంట్ వీసాలు లభించాయి. విద్యార్థులు ఆ దేశం వైపు మొగ్గు చూపడానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి.


ప్రపంచంలోని అత్యుత్తమమైన విశ్వవిద్యాలయాల్లో 3 శాతం విద్యాసంస్థలు న్యూజిలాండ్‌లోనే ఉన్నాయి. ఆక్లాండ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే 87వ స్థానంలో ఉంది. కాంటర్‌బరీ, లింకన్, ఒటాగో, వైకాటో ఇతర ప్రముఖమైన విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. చదువు పూర్తైన తర్వాత విద్యాభ్యాసాన్ని బట్టి కొన్ని రోజుల పాటు వర్క్‌ వీసాకి దరఖాస్తు చేసుకుని అక్కడే జాబ్ చేయవచ్చు. మాస్టర్స్ చేసిన వారికి 3 సంవత్సరాల పాటు జాబ్ చేసే అవకాశం ఉంటుంది.

ఇతర దేశాల్లో పోలిస్తే న్యూజిలాండ్‌లో ఖర్చులు, జీవన వ్యయం కూడా తక్కువే కావడంతో ఎక్కువ మంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. న్యూజిలాండ్ డాలర్ అమెరికా డాలర్, పౌండ్ స్టెర్లింగ్, యూరోలతో పోలిస్తే తక్కువ ఎక్స్ఛేంజ్ రేట్ కలిగి ఉంది. దీంతో విద్యార్థులు తక్కువ ఖర్చులోనే తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయగలుగుతున్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య వ్యూహాత్మక విద్యలో భాగంగా 4 లక్షల డాలర్లను స్కాలర్షిప్‌లకు కేటాయించింది. విద్యార్థులు తమ చదువులను బట్టి రూ.5 లక్షల దాకా స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంది.


న్యూజిలాండ్‌లో నెలకు సుమారు 90వేల వరకు మాత్రమే ఖర్చు వస్తుంది. అయితే ఇది విద్యార్థులు ఉండే నివాస ప్రాంతం, జీవన శైలి, విశ్వవిద్యాలయం బట్టి మారుతుంది. అక్కడ పెద్ద సంఖ్యలో భారత సంతతివారు ఉండటం కూడా కలిసొచ్చే అంశం. అక్కడికి వెళ్లిన విద్యార్థులు ఎక్కువగా భారతీయ సంతతి వ్యక్తులు ఉండటంతో కొత్త దేశం అనే ఫీలింగ్‌ని దూరం చేసుకోవచ్చు. న్యూజిలాండ్‌లో చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ చదివిన విద్యార్థులను నియమించుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపుతాయి.


Tags

Read MoreRead Less
Next Story