NDA Jobs: ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలు..

NDA Jobs: ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలు..
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

NDA Jobs: నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్ అర్హతతో నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఉచితంగా బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు చదువుకుంటూ ఉద్యోగ శిక్షణ తీసుకోవచ్చు. అనంతరం నేరుగా లెవల్ 10 పేస్కేల్‌తో ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌లో ఉన్నత హోదాతో విధుల్లో చేరిపోవచ్చు. వసతి, భోజనం, దుస్తులు అన్నీ ఎన్‌డీఏ చూసుకుంటుంది. చదువు పూర్తయిన పిమ్మట సంబంధిత కేంద్రాల్లో శిక్షణ ఉంటుంది.

ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైఫండ్ అందుతుంది. శిక్షణ పూర్తి చేసుకున్నావారు ఆర్మీలో లెప్టినెంట్, నేవీలో సబ్ లెప్టినెంట్, ఏర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ (పైలట్)/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభిస్తారు. ఈ మూడు సమాన స్థాయి ఉద్యోగాలు. అందరికే ఒకటే పే స్కేల్ అమలవుతుంది. మొదటి నెల నుంచి లక్షకు పైగా వేతనం లభిస్తుంది.

ముఖ్య సమాచారం:

మొత్తం ఖాళీలు 400.

వీటిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370 (ఆర్మీ 208, నేవీ 42, ఏర్‌ఫోర్స్ 120),

నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ స్కీం)లో 30 పోస్టులు

ఏర్‌ఫోర్స్, నేవల్ వింగ్స్ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ఖాళీలకు ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపీసీ విద్యార్థులకు ఈ పరీక్ష అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కేవలం ఈ గ్రూప్ నుంచే 460 (మ్యాథ్స్‌లో 300, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 160) మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఆర్ట్స్, బైపీసీ గ్రూపు విద్యార్థులు అయితే మరింత కష్టపడాల్సి ఉంటుంది. పరీక్షల్లో అర్హతకు సబ్జెక్టుల వారీగా కనీసం 25 శాతం మార్కులు పొందడం తన్పనిసరి.

అభ్యర్థుల కనీస ఎత్తు 157 సెం.మీ ఉండాలి. అదే ఏర్‌ఫోర్స్‌కు అయితే 162.5 సెం.మీ ఉండాలి. ఎత్తుకు తగిన బరువు కూడా అవసరం. ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 29 సాయింత్రం 6 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించనవసరం లేదు. పరీక్ష తేదీ: సెప్టెంబర్ 5 ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://upsc.gov.in/.

Tags

Read MoreRead Less
Next Story