Top

PayPal Notification: 'పేపాల్‌'లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన..

PayPal Notification: డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ కొత్తగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది

PayPal Notification: పేపాల్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
X

PayPal Notification: డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ప్రముఖ కాలేజీల నుంచి 1000 ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. పేపాల్ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు చెన్నైలలో డెవలప్‌మెంట్ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో రిక్రూట్‌మెంట్స్ ఉంటాయని తెలిపింది. సాప్ట్‌వేర్, డేటా సైన్స్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్ విభాగాల్లో ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పేపాల్ సంస్థలో మన దేశంలో 4500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

టైడ్-హైదరాబాద్‌లో 300 జాబ్స్

యూకే ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ . ఈ నియామకాలను హైదరాబాద్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ‌రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొంది. మొత్తం 300 నియామకాల్లో 180 పోస్టులు ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఉంటాయి. ఓ 50 మందిని గురుగ్రామ్ కేంద్రంలోని మార్కెటింగ్ విభాగంలో నియమిస్తామని పేర్కొంది. మిగిలిన వారిని వినియోగదారుల సహాయం కోసం తీసుకుంటామని వెల్లడించింది.

Next Story

RELATED STORIES