RBI Recruitment 2021: పదవతరగతి అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లోనూ ఖాళీలు

RBI Recruitment 2021: పదవతరగతి అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లోనూ ఖాళీలు

RBI Recruitment 2021: 

RBI Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులలో 57 పోస్టులు హైదరాబాద్ కేంద్రంలోనూ ఉన్నాయి.

RBI Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులలో 57 పోస్టులు హైదరాబాద్ కేంద్రంలోనూ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rbi.org.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

పూర్తి వివరాలు:

మొత్తం ఖాళీలు: 841

అర్హత: పదో తరగతి (ఎస్ఎస్‌సీ/ మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత ఉండాలి. ఫిబ్రవరి 1,2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

వయసు: ఫిబ్రవరి 1,2021 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్ధతుల్లో దరఖాస్తు చేసినా అంగీకరించబడవు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/జనరల్ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి.

ముఖ్యతేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 24, 2021

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 15, 2021

పరీక్ష తేదీ: 2021, ఏప్రిల్ 9, 10 తేదీల్లో పరీక్ష ఉంటుంది.

వెబ్‌సైట్: https://www.rbi.org.in/

Tags

Read MoreRead Less
Next Story