సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు గడువు..

సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు గడువు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన హార్డ్ కాపీని సింగరేణి ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.

సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 651 పోస్టులకు గాను తొలి విడద 372 ట్రైనీ ఉద్యోగాలకు సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. 128 ఫిట్టర్, 51 ఎలక్ట్రీషియన్, 54 వెల్డర్, 22 టర్నర్/మెషినిస్టు, 14 మోటారు మెకానిక్, 19 పౌండ్రీమెన్/మౌల్డర్, 84 జూనియర్ స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. వీటిలో స్టానిక రిజర్వేషన్ కింద 305 పోస్టులను ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అభ్యర్ధులతో భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని తెలంగాణ వారందరికీ (అన్ రిజర్వుడు) వర్తింపజేస్తారు.

స్థానిక రిజర్వేషన్ కింద భర్తీ చేయనున్న వాటిలో 105 ఫిట్టర్, 43 ఎలక్ట్రీషియన్, 44 వెల్డర్, 18 టర్నర్/ మెషినిస్ట్, 16 ఫౌండ్రీమెన్/మౌల్డర్, 67 స్టాఫ్ నర్స్, 12 మోటారు మెకానిక్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్దులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్ధులు www.scclmines.com వెబ్‌‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తుది గడువు ఫిబ్రవరి 4.

ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన హార్డ్ కాపీని సింగరేణి ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చివరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆ సంస్థ జీఎం (పర్సనల్) ఆనందరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story