TET Notification: టెట్ నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలు ఇవే

TET Notification: టెట్ నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలు ఇవే
ఈ నెల అంటే ఆగస్ట్ 16 నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షను సెప్టెంబర్ 15న నిర్వహింనుండగా, సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేస్తారు.

తెలంగాణలో ఉపాధ్యాయ పరీక్షాభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన టెట్‌(TET) నోటిఫికేషన్‌ని విడుదల చేశారు. టెట్‌ పరీక్షను సెప్టెంబర్ 15న నిర్వహించనున్నారు. ఆ నెలలోనే 27వ తేదీన పరీక్షా ఫలితాలు వెలువడతాయి. టెట్‌లో పాస్‌ అయ్యే వారికే ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ నియమాలకు అర్హులవుతారు. ఖాళీగా ఉన్న 13,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది.

మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లో కూడిన మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.గత సంవత్సరం జూన్ 12న టెట్ పరీక్షని నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించనున్న 4వ టెట్ పరీక్ష ఇది. ఇంతకు ముందు 2016 మే, 2017 జులూ, 2022 జూన్‌లో నిర్వహించారు.

ముఖ్య తేదీలు

ఈ నెల అంటే ఆగస్ట్ 16 నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షను సెప్టెంబర్ 15న నిర్వహింనుండగా, సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేస్తారు. ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే 7 సంవత్సరాల దాకా దానికి కాలపరిమితి ఉండేది. కానీ ఒక్కసారి అర్హత సాధిస్తే జీవితాంతం దానికి విలువ ఉండేలా ఎన్‌సీటీఈ నిర్ణయం తీసుకుంది.

టెట్ పరీక్షలో 2 పేపర్లుగా నిర్వహించనున్నారు. పేపర్-1లో ఉత్తీర్ణులైతే ఎస్జీటీ(1-5 తరగతులు) పోస్టులకు, పేపర్-2లో ఉత్తీర్ణులైన వారరు స్కూల్ అసిస్టెంట్(6-8 తరగుతులు) ఉద్యోగాలకు అర్హులవుతారు. గత సంవత్సరం పేపర్-1లో 1,04,078 ఉత్తీర్ణులవగా, 1,24,535 మంది పేపర్-2లో అర్హత సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story