తాజా వార్తలు

దేశంలో 32 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటివ్ కేసులు

దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 67,151 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 32,34,475కు చేరింది.

దేశంలో 32 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటివ్ కేసులు
X

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం 60 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 32 ల‌క్ష‌లు దాటాయి. తాజాగా దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 67,151 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 32,34,475కు చేరింది. ఇందులో 7,07,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారి నుంచి 24,67,759 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి ఒక్కరోజే 1059 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 59,449కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

Next Story

RELATED STORIES