తాజా వార్తలు

కరోనా రెండోసారి కూడా వస్తే దాని ప్రభావం వ్యాక్సిన్‌పై పడుతుంది: శాస్త్రవేత్తలు

యువత వలన కరోనా మరణాలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

కరోనా రెండోసారి కూడా వస్తే దాని ప్రభావం వ్యాక్సిన్‌పై పడుతుంది: శాస్త్రవేత్తలు
X

యువత వలన కరోనా మరణాలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. యువతకు కరోనా వస్తే.. వారి నుంచి ఇంట్లో వారికి కూడా ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉందని అభిప్రాయ పడ్డారు. దీంతో మరణాలు కూడా పెరుగుతాయని డబ్ల్యూహెచ్‌ఓ యూరప్‌ చీఫ్‌ డాక్టర్‌ హన్స్‌ క్లూగ్‌ అన్నారు. కచ్చితంగా యువత కారణంగా ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

అటు, కరోనా వైరస్ సోకిన వారికి రెండోసారి కరోనా సోకుతుందనే నిర్థారణ ఇప్పటివరకూ కాలేదని తెలిపారు. ఈ విషయంలో ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరంలేదని.. దీనిపై ఇంకా లోతుగా పరిశోధనలు జరగాలని శాస్త్రవేత్తుల అంటున్నారు. ఒక వేళ అదే నిర్థారణ అయితే, వ్యాక్సిన్ కార్యక్రమంపై కూడా దీని ప్రభావం ఉంటుంది.

Next Story

RELATED STORIES