కరోనా సీజన్.. ఇంట్లో కంటే బయటే మేలు

కరోనా సీజన్.. ఇంట్లో కంటే బయటే మేలు
కొద్ది రోజుల క్రితం వరకు బయటకు వస్తే కరోనా.. ఇప్పుడు బయటకంటే ఇంట్లో ఉంటేనే వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని

వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు బయటకు వస్తే కరోనా.. ఇప్పుడు బయటకంటే ఇంట్లో ఉంటేనే వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తోంది. సూర్య చంద్రులను చూసే అవకాశం లేని ఆకాశహార్మ్యాలు. ఇంట్లో లైట్లు వేసుకుంటేనే వెలుగు.. ఇలాంటి ఇళ్లలో ఉంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరీ నాలుగ్గోడల మధ్య కాకుండా కాస్త ఆరుబయట ఉండటానికి ప్రయత్నించాలి. సూర్యరశ్మి కిరణాలు శరీరానికి తగిలేందుకు వీలుగా ఉదయం నుంచి మధ్యాహ్నం మూడింటివరకు రోజూ ఓ అరగంట పాటు బయట ఉంటే సరిపోతుంది.

సూర్యుని కిరణాలు వైరస్ చర్యను స్థంభింపజేస్తుందని 'ది జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్' పేర్కొంది. బయటకు వెళ్లినప్పుడే మాస్క్ ధరించండి. అతి జాగ్రత్తతో 24 గంటలూ మాస్క్ పెట్టుకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు విండోస్ తెరిచి ఉంచితే గాలి సరఫరా జరుగుతుంది. విమాన ప్రయాణాలు కొన్నాళ్లు మానుకుంటే మంచిది. మరీ అవసరమనుకుంటే తప్పదు. పరిచయం లేని వారి పక్కన కూర్చుని ఇబ్బంది పడాల్సి వస్తుంది. తుమ్మినా, దగ్గినా అనుమానించే రోజులు.

విమాన ప్రయాణాల్లో కరోనా సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. లాక్ డౌన్ తర్వాత చాలా మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారు. పాత అలవాటు ప్రకారం లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడం, పక్క పక్కన కూర్చుని తినడం చేయకపోవడం బెటర్. అందుకే మీ లంచ్ మీరొక్కరే తినడం ఉత్తమం. మీ బ్యాగులో లేదా మీ పాకెట్ లో సెల్ తో పాటు శానిటైజర్ ఉంచుకుంటే ఏదైనా తినేటప్పుడు చేతుల్ని శానిటైజ్ చేసుకోవచ్చు. సోప్ అయితే ఇంకా బెటర్. మీ సోపుని మీరే క్యారీ చేయండి. వ్యాక్సిన్, ఔషధాలు అందుబాటులోకి వచ్చేంతవరకు సామాజిక దూరం పాటించడం మేలు.

Tags

Read MoreRead Less
Next Story