తాజా వార్తలు

జగనన్న విద్యాకానుక పథకానికి అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు

జగనన్న విద్యాకానుక పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జగనన్న విద్యాకానుక పథకానికి అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు
X

జగనన్న విద్యాకానుక పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ను విద్యార్ధులకు పంపిణీ చేయనున్నారు. సెప్టెంబరు 5 , 2020న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ, మండల ప్రజా పరిషత్, మున్సిపల్, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, మోడల్పా ఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ప్రభుత్వ అనుమతి ఉన్న మదర్శాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

Next Story

RELATED STORIES