Tamilnadu : రూ.535 కోట్ల నగదుతో వెళ్తున్న ట్రక్ రోడ్డుపై నిలిచిపోయింది

Tamilnadu : రూ.535 కోట్ల నగదుతో వెళ్తున్న ట్రక్ రోడ్డుపై నిలిచిపోయింది

రిజర్వ్ బ్యాంకుకు చెందిన వెయ్యికోట్ల నగదును రెండు ట్రక్కులలో తరలిస్తుండగా ఒక ట్రక్కులో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో సదరు ట్రక్కును రోడ్డుపైనే ఆపేశారు. ట్రక్కులకు రక్షణగా పోలీసులు ఉన్నారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురంకు రూ. 1,070 కోట్ల నగదును తీసుకువెళుతున్న రెండు కంటైనర్ ట్రక్కులలో ఒకటి చెన్నైలోని తాంబరంలో పాడయిపోయింది. ట్రక్కు ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో జాతీయ రహదారిపై 17 మంది పోలీసులు రెండు వాహనాలకు రక్షణగా ఉన్నారు.

535 కోట్ల నగదుతో వెళ్తున్న ట్రక్కు చెడిపోయిందని తెలుసుకున్న క్రోంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరింత రక్షణ కోసం పోలీసు ఫోర్స్ ను అధనంగా పిలిచారు. పలు జిల్లాల బ్యాంకులకు కరెన్సీని అందించేందుకు రెండు లారీలు చెన్నైలోని ఆర్‌బీఐ కార్యాలయం నుంచి విల్లుపురం బయలుదేరాయి. అంతలోనే ట్రక్కులలో ఒకటి చెడిపోవడంతో, భద్రతా కారణాల దృష్ట్యా దానిని చెన్నైలోని తాంబరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధాకు తరలించారు.

తాంబరం అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని చెడిపోయిన లారీని గుర్తించారు. ట్రక్కును సిద్ధా ఇన్‌స్టిట్యూట్‌కు తరలించి, గేట్లను మూసివేశారు. ఇన్‌స్టిట్యూట్‌లోకి బయటవ్యక్తులకు ప్రవేశాన్ని నిషేదించారు. మెకానిక్‌లు ట్రక్కును రిపేరు చేయలేకపోవడంతో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్‌కు ట్రక్కును తిరిగి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story