RAIL: వందేభారత్‌ రైళ్లపై రాళ్ల దాడులు.. ఎంత నష్టమంటే...

RAIL: వందేభారత్‌ రైళ్లపై రాళ్ల దాడులు.. ఎంత నష్టమంటే...
వందేభారత్‌పై రాళ్ల దాడితో రూ. 55 లక్షల నష్టం.... ఎవరూ గాయపడలేదన్న కేంద్రం

వందే భారత్ రైళ్ల((Vande Bharat Express Train))పై దేశంలో పలు చోట్ల ఆకతాయిలు రాళ్లు రువ్వుతున్నారు. ఈ ఘటనల్లో రైల్వేశాఖ(RAILWAYS)కు ఇప్పటివరకు 55 లక్షల60 వేల రూపాయల మేర నష్టం(LOSS) వాటిల్లినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(ASHWINI VAYSHNAV) వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటివరకు వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వడంతో తమ శాఖకు జరిగిన ఆస్తి నష్టం వివరాలను ఆయన లోక్ సభకు తెలిపారు. ఆయా ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 151మందిని అరెస్టు(ARREST) చేసినట్టు వెల్లడించారు. వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనల్లో ఎవరూ చనిపోవడం గానీ, చోరీ లేదా ప్రయాణీకులకు చెందిన వస్తువులు ధ్వంసం కావడం గానీ జరగలేదన్నారు.


ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడం సహా ప్రయాణికుల ప్రాణాలను, రైల్వే ఆస్తులను కాపాడేందుకు ఆర్ పీఎఫ్ అధికారులు పోలీసులు, స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనిచేస్తున్నారన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగితే ఉత్పన్నమయ్యే పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. కదిలే రైళ్లపై దాడి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశామన్న ఆయన.. రెగ్యులర్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మరోవైపు... వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. ఆగ్రా రైల్వే డివిజన్ (Agra Railway Division)లోని భోపాల్ (Bhopal) నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ (Nizamuddin station) వరకు నడుస్తున్న వందేభారత్ రైలుపై ఆకతాయిలు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో C-7 కోచ్‌లోని సీట్ నంబర్ 13-14 కిటికీ అద్దాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే బృందం ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై విచారణ చేపట్టింది.


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వందేభారత్ రైళ్ల నాణ్యతపై విమర్శలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వందే భారత్ రైళ్లలో 25 రకాల మార్పులను చేయనున్నారు. రైళ్లలో ప్రయాణికులు కూర్చునే కుషింగ్స్ గట్టిగా ఉన్న నేపథ్యంలో వాటిని మార్చనున్నారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేలా మరిన్ని స్లాట్‌లను ఏర్పాటు చేయనున్నారు. సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఎక్కువగా వంగేలా సీటును ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ సీట్ల రంగును రెడ్‌ నుంచి బ్లూకు మార్చనున్నారు. కోచ్‌లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్‌ ఫైర్‌ డిటెక్షన్‌ వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నారు. దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా వీల్ ఛైర్‌ ఫిక్సింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story