ACCIDENT: మహారాష్ట్రలో ఘోరం...16 మంది దుర్మరణం...

ACCIDENT: మహారాష్ట్రలో ఘోరం...16 మంది దుర్మరణం...
థానేలో ఘోర ప్రమాదం... కార్మికులపై కూలిన గిడ్డర్‌ యంత్రం...

మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. షాపూర్‌లోని సర్లాంబే గ్రామ సమీపంలో నిర్మాణ స్థలంలో గర్డర్ లాంచింగ్ మెషిన్(girder launching machine) కూలి 16 మంది కార్మికులు దుర్మరణం‍(16 Killed In Crane Accident‌) పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయిదుగురు క్రేన్‌ కింద చిక్కుకున్నారని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) వెల్లడించింది. వారిని రక్షించేందుకు సహాయ చర్యలు చేపట్టారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వే(Thane Expressway Site) నిర్మాణ సమయంలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. చాలామంది కార్మికులు ఘటనా స్థలంలోనే మరణించారని వెల్లడించారు.


సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే( Samruddhi Expressway) ఫేజ్ త్రి నిర్మాణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా వేకువ జామున గర్డర్ లాంచింగ్ మెషిన్ కూలిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గర్డర్ లాంచింగ్ మెషిన్ ఎలా కూలిందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.


హైవేలు, రైలు వంతెనల నిర్మాణంలో కార్మికులు ఉపయోగించే పెద్ద ఉక్కు బీమ్‌లు(large steel beams or girders), గిర్డర్‌లను తరలించేందుకు ప్రత్యేకమైన క్రేన్ అయిన గర్డర్ లాంచింగ్ మెషీన్‌ను ఉపయోగిస్తారు. ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను అనుసంధానించేందుకు 701 కిలోమీటర్ల పొడవైన సమృద్ధి మహా మార్గ్‌( 701-kilometer-long Samruddhi Mahamarg)ను నిర్మిస్తున్నారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని చేపడుతోంది. ఇందులో మొదటి దశ, నాగ్‌పూర్ నుంచి షిర్డీని కలుపుతూ నిర్మించారు. దీనిని గత ఏడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేజ్‌-3 నిర్మాణ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో అక్కడ 30 మంది పనిచేస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మందికి కాళ్ళు, చేతులు, తలపై తీవ్ర గాయాలయ్యాయని వాపోయారు.

Tags

Read MoreRead Less
Next Story