అరుదైన దృశ్యం.. 7 నెలల బాలుడి కడుపులో 2 కిలోల పిండం..

అరుదైన దృశ్యం.. 7 నెలల బాలుడి కడుపులో 2 కిలోల పిండం..
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 7 నెలల బాలుడి కడుపులో నుంచి 2 కిలోల పిండాన్ని తొలగించారు.

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 7 నెలల బాలుడి కడుపులో నుంచి 2 కిలోల పిండాన్ని తొలగించారు. నెలలు నిండకుండానే బిడ్డను ప్రసవించి ఆ తల్లి చనిపోయింది. పుట్టిన చిన్నారి కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నాడు.. అయినా వైద్య ప్రక్రియలో ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది.. తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏ అవకరాలు లేకుండా ఉన్నదీ లేనిదీ ముందే చెబుతున్నారు.. మరి ఆ తల్లి అలాంటి పరీక్షలు చేయించుకుందో లేదో.. 7 నెలలోనే బిడ్డకు బయటకు వచ్చాడు.. ఆమె కన్నుమూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని సరోజినీ నాయుడు పిల్లల ఆసుపత్రి వైద్యులు శుక్రవారం ఏడు నెలల బాలుడికి శస్త్రచికిత్స చేసి అతని కడుపు నుండి 2 కిలోల బరువున్న పిండాన్ని తొలగించారు. ఫెటస్ ఇన్ ఫీటూ (FIF) అని పిలువబడే ఈ అరుదైన పరిస్థితి నుంచి బాలుడిని ప్రాణాలతో బయటపడేసేందుకు వైద్యులకు నాలుగు గంటలు పట్టింది. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు.

ఈ ప్రక్రియ కోసం వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ డి కుమార్ ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతాప్‌గఢ్ జిల్లా కుంట ప్రాంతానికి చెందిన రైతు తన 7 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. “బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బిడ్డ తల్లి చనిపోయింది. పిల్లవాడి కడుపు ఉబ్బినట్లు ఉంది. దాంతో పిల్లవాడిని వైద్యులు పరీక్షించారు. ప్రాథమిక పరీక్షల తర్వాత CT స్కాన్ చేయగా, బాలుడి కడుపులో పిండం పెరుగుతున్నట్లు గుర్తించారు వైద్యులు. శస్త్రచికిత్స ద్వారా పిండాన్ని తొలగించారు.

పిండంలో పిండం అంటే ఏమిటి?

పిండంలో పిండం (ఎఫ్‌ఐఎఫ్) అనేది పుట్టుకతో వచ్చే అరుదైన వ్యాధి అని డాక్టర్ చెప్పారు. “ఇది పరాన్నజీవి పిండం దాని జంట శరీరంలో ఉన్న పరిస్థితి. కవలలలో ఒకరు తల్లి కడుపులో అభివృద్ధి చెందగా, మరొకరు శిశువు గర్భంలోకి వెళ్లి అక్కడ అభివృద్ధి చెందడం ప్రారంభించినప్పుడు ఇది జరుగుతుంది, ”అని ఆయన వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story