కట్నం కారణంగా పెళ్లి ఆగిపోవడంతో వైద్యురాలు ఆత్మహత్య

కట్నం కారణంగా పెళ్లి ఆగిపోవడంతో వైద్యురాలు ఆత్మహత్య
కట్నం కారణంగా పెళ్లి ఆగిపోయిందని కేరళకు చెందిన 26 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది.

కట్నం కారణంగా పెళ్లి ఆగిపోయిందని కేరళకు చెందిన 26 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. షహానా అనే 26 ఏళ్ల డాక్టర్ కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. ఆమె ప్రేమించిన ప్రియుడి కుటుంబసభ్యులు కట్నం డిమాండ్ చేశారు. వరుడి కుటుంబం నుండి కట్నం డిమాండ్ల జాబితాలో బంగారం, భూమి, BMW కారు ఉన్నాయి. దాంతో అమ్మాయి కుటుంబసభ్యులకు వధువు డిమాండ్లు తలకు మించిన భారంగా అనిపించి తలపట్టుకున్నారు. ఆమె ప్రియుడు ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమె బాయ్‌ఫ్రెండ్ - మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి కూడా.. అయినా కట్నం కావాలని వేధించారు. షహానా తండ్రి మిడిల్ ఈస్ట్‌లో ఉద్యోగం చేసేవారు. ఆయన ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.

మహిళా కమిషన్ స్పందన

కేరళ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సతీదేవి బుధవారం షహానా తల్లిని ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలపై మహిళా కమిషన్ నివేదిక కోరుతుందని, ఈ కేసుపై విచారణ జరిపించాలని సతీదేవి డిమాండ్ చేశారు. బాధితురాలి నుంచి వరకట్నం డిమాండ్ చేసినట్లు రుజువైతే వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు పెడతామని సతీదేవి తెలిపారు. ఈ విషయంపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మైనారిటీ కమిషన్ కూడా స్వయంగా కేసు నమోదు చేసింది. వరుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ అతనిని తమ సంస్థలోని అన్ని బాధ్యతల నుంచి తప్పించింది.

Tags

Read MoreRead Less
Next Story